ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఆలిసా హేలే ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సిడ్నీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ-20లో 148 పరుగులతో పొట్టి ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఘనత సాధించింది. 61 బంతుల్లోనే ఈ రికార్డు నెలకొల్పడం విశేషం.
46 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసి రెండో వేగవంతమైన శతకం అందుకుంది. ఇందులో 19 బౌండరీలు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఇటీవలే 100వ టీ20 ఆడింది ఆలిసా. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిషెల్ స్టార్క్ ఈమె భర్త కావడం విశేషం
"ఈ రోజు నాకు బాగా కలిసొచ్చింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తున్నందున ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నా" - ఆలిసా హేలే, ఆసీస్ మహిళా క్రికెటర్
ఆలిసా కంటే ముందు ఆసీస్ కెప్టెన్ మెగ్ ల్యానింగ్(133*) ఈ ఘనత సాధించింది. ఇప్పుడు ఆమెను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరిందీ 29 ఏళ్ల క్రికెటర్. మహిళా క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు హర్మన్ ప్రీత్ కౌర్(103) పేరిట ఉంది.
ఇదీ చదవండి: స్విస్ దిగ్గజం సినిమా చూస్తాడట.. సలహా ఇవ్వండి!