తెలుగు సినిమా 'అల వైకుంఠపురములో'ని బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించిందని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఈ విషయాన్ని తెలిపాడు.
ఈ మధ్య టిక్‌టాక్‌లో అదరగొడుతున్నావు, ఓ తెలుగు సినిమా పాటకు కూడా డ్యాన్స్ చేసినట్లున్నావు అని రోహిత్ అడగ్గా.. "అవును. బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేశా. అందుకోసం చాలా కష్టపడ్డా. టాలీవుడ్, బాలీవుడ్ పాటల స్టెప్పులు నేర్చుకోవడం కష్టం. నా కూతురు వల్లే టిక్‌టాక్ వీడియోలు చేయడం అలవాటైంది" అని వార్నర్ చెప్పాడు. దీంతో పాటు క్రికెట్ గురించి మాట్లాడుతూ వార్నర్.
"ఈ ఏడాది అక్టోబర్‌లో పురుషుల టీ20 ప్రపంచకప్ నిర్వహణ కష్టమే. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరిగే అవకాశాల్లేవు. 16 జట్లను ఒక్కచోటికి చేర్చడం కష్టం. 2018లో భారత్‌తో సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓడిపోతుంటే బాధగా అనిపించిందని, జట్టులో లేకపోవడం వల్ల ఏం చేయలేకపోయాను."