తెలంగాణ

telangana

By

Published : Feb 20, 2020, 4:35 PM IST

Updated : Mar 1, 2020, 11:28 PM IST

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్‌: భారత్​తో పోరు​ ముంగిట ఆసీస్​కు షాక్‌

మహిళల టీ20 ప్రపంచకప్​ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియాకు షాక్​ తగిలింది. ఆ జట్టు స్టార్​ ఆల్​రౌండర్​ తైలా వ్లామింక్​ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంది. రేపు(శుక్రవారం) జరిగే ఆరంభ మ్యాచ్​లో టీమిండియాతో తలపడనుంది కంగారూ జట్టు.

Tayla Vlaeminck
మహిళల టీ20 ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియాకు షాక్‌

మహిళా టీ20 ప్రపంచకప్‌ ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకు చెందిన స్టార్‌ పేసర్‌ తైలా వ్లామింక్‌ కుడి కాలికి గాయమైంది. ఫలితంగా ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆమె స్థానంలో ఆఫ్‌ స్పిన్నర్‌ మాల్లీ స్ట్రానోను జట్టులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో తైలా అత్యుత్తమ పేసర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

"మెగా టోర్నీల్లో ఉత్తమ క్రికెటర్లను ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోవాలని ఎవరూ అనుకోరు. వ్లామింక్​ విషయంలో అలా జరిగింది. అయితే, ఆమె కచ్చితంగా అత్యుత్తమంగా తిరిగి వస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. భవిష్యత్‌లో ఆస్ట్రేలియా తరఫున కీలక పాత్ర పోషిస్తుంది" అని ఆ జట్టు హెడ్‌కోచ్‌ మాథ్యూమాట్‌ వెల్లడించాడు.

శుక్రవారం గ్రూప్‌ ఏ విభాగంలో ఆస్ట్రేలియా, టీమిండియా మహిళా జట్లు తొలి మ్యాచ్‌ ఆడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ.. వచ్చే నెల 8 వరకు జరగనుంది.

ఇదీ చూడండి:మహిళా టీ20 ప్రపంచకప్​: ఈ జట్టుకు ఆ దమ్ముందా!

Last Updated : Mar 1, 2020, 11:28 PM IST

ABOUT THE AUTHOR

...view details