మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్లో భారత్‌తో తలపడే జట్టు తెలిసిపోయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది ఆస్ట్రేలియా. కాసేపు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించినా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా ఫలితం ఆసీస్‌కు అనుకూలంగా వచ్చింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. తర్వాత ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌ను 13 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో 98 పరుగులు చేయాల్సి వచ్చింది. సౌతాఫ్రికా బ్యాట్స్ఉమెన్లో లిజెల్లే లీ (10), డేన్ వాన్ నీకెర్క్ (12), మిగ్నోన్ (0) విఫలమయ్యారు. అనంతరం వచ్చిన సునే లాస్ (21), లౌరా (41) కాసేపు గెలుపుపై ఆశలు చిగురించారు. కానీ ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఫలితంగా సఫారీ సేన నిర్ణీత 13 ఓవర్లలో 92 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా కంగారూ జట్టు 5 పరుగుల తేడాతో గెలిచింది,
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 49 పరుగులు చేసింది. ప్రత్యర్థి దక్షిణాఫ్రికా బౌలర్లలో డె క్లార్క్ 3, మాల్బా, కాకా తలో వికెట్ పడగొట్టారు.తొలుత టాస్ గెలిచిన సఫారీ మహిళలు.. ఆసీస్‌కు బ్యాటింగ్ అప్పగించారు. ఓపెనర్లు హేలీ-మూనీ.. తొలి వికెట్‌కు 34 పరుగులు జోడించారు. అనంతరం హేలీ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైంది. మూనీ 28 రన్స్ చేసి పెవిలియన్ చేరింది.