ఐసీసీ మహిళా ప్రపంచకప్ టోర్నీలో తొలి స్థానం ఖాయం చేసుకున్న జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. ఐసీసీ మహిళా ఛాంపియన్షిప్(ఐడబ్ల్యూసీ)లో భాగంగా విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది కంగారూ జట్టు. ఫలితంగా ఈ పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్రపంచకప్-2021కి నేరుగా అర్హత సాధించింది.
ఐడబ్ల్యూసీ పట్టికలో టాప్ 4లో ఉన్న జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. చివరి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫయర్స్ ఆడతాయి. ఇందులో గెలుపొందిన జట్లు రీజినల్ క్వాలిఫయర్స్ అయిన బంగ్లాదేశ్, ఐర్లాండ్, ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఈస్ట్ పసిఫిక్, యూరప్ దేశాలతో తలపడతాయి.
ఐడబ్ల్యూసీ తొలి ఎడిషన్ సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. తాజా రెండో ఎడిషన్‌లోనూ అగ్రస్థానంలోనే నిలిచింది. ఈ సిరీస్‌లో 15 మ్యాచ్‌లు ఆడి ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. ఫలితంగా 28 పాయింట్లతో కొనసాగుతోంది. 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఆస్ట్రేలియా ఓడిపోయింది.
ఇంగ్లాండ్ 24 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే ఈ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. భారత్, దక్షిణాఫ్రికా 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. ఈ రెండు జట్లు 15 మ్యాచ్‌లు ఆడాయి. పాకిస్థాన్ 15 మ్యాచ్‌లు ఆడింది. వెస్టిండీస్, శ్రీలంక చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఇవీ చూడండి.. టాప్-10లో ఇద్దరు భారత మహిళా క్రికెటర్లు