తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​తో సిరీస్​కు ఆస్ట్రేలియా జట్టులో మార్పు - కోహ్లీ

వచ్చే నెలలో భారత్ పర్యటనకు రానుంది ఆస్టేలియా. ఈ సిరీస్​లో భాగంగా మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే జట్టును ప్రకటించిన ఆసీస్.. తాజాగా ఓ మార్పు చేసింది.

Australia
షార్ట్

By

Published : Dec 30, 2019, 2:58 PM IST

Updated : Dec 30, 2019, 3:09 PM IST

జనవరిలో మూడు వన్డేల సిరీస్​ కోసం భారత్​లో పర్యటించనుంది ఆస్ట్రేలియా. ఇందుకోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది ఆసీస్. ఇప్పుడు ఓ మార్పు చేసింది. గాయపడిన సీన్ అబాట్ స్థానంలో డీఆర్సీ షార్ట్​​ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

బిగ్​బాష్​ లీగ్​లో ఆడుతూ అబాట్​ గాయపడ్డాడు. అతడికి నాలుగు వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పగా, క్రికెట్ ఆస్ట్రేలియాఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అబాట్ స్థానంలో ఎంపికైన షార్ట్..​ బ్యాటింగ్​తో పాటు స్పిన్​ బౌలింగ్ చేయగలడు.

ఆస్ట్రేలియా వన్డే జట్టు

ఆరోన్ ఫించ్ (సారథి), ఆస్టన్ అగర్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్, పీటర్ హాండ్స్​కోంబ్, జోష్ హేజిల్​వుడ్, లబుషేన్, కేన్ రిచర్డ్​సన్, డీఆర్సీ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆస్టన్ టర్నర్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

ఇవీ చూడండి.. 'మేరీ, నిఖత్.. దేశం గర్వించదగ్గ క్రీడాకారిణులు'

Last Updated : Dec 30, 2019, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details