యాషెస్ సిరీస్ తొలి టెస్టులో పట్టు బిగించిందనుకున్నా ఇంగ్లాండ్.. ఓటమికి, డ్రాకు మధ్య వేలాడుతుంది. తొలి మూడు రోజులు ఇంగ్లీష్ జట్టు ఆట చూస్తే విజయం ఖాయమే అనుకున్నారు. కానీ అనూహ్యంగా నాలుగో రోజు ఆస్ట్రేలియా ప్లేయర్లు స్టీవ్ స్మిత్(142), మ్యాథ్యూ వేడ్(110) శతకాలతో విజృంభించి ఇంగ్లాండ్ ముందు 398 పరుగులు లక్ష్యాన్ని ఉంచారు. ఒక్క రోజు మాత్రమే ఆట మిగిలి ఉంది. ఇంగ్లీష్ జట్టు మ్యాచ్ గెలవాలంటే అద్భుతమే జరగాలి. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 13/0 పరుగులతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
ఓవర్‌నైట్ స్కోరు 124/3 పరుగుల వద్ద నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లీష్ బౌలర్లను ఆటాడుకున్నారు. క్రీజులో ఉన్న స్మిత్ - ట్రేవిస్ హెడ్ నిలకడగా ఆడుతూ స్కోరు వేగం పెంచారు. అనంతరం హెడ్(51) ఔటైనా.. వేడ్ సాయంతో ఆసీస్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు స్మిత్. వీరిద్దరూ 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మరోసారి ఆదుకున్న స్మిత్..
తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగుల చేసి ఆస్ట్రేలియాను ఆదుకున్న స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తాచాటి కంగారూ జట్టును గెలుపు ముంగిట ఉంచాడు. చూడచక్కని కవర్‌డ్రైవ్‌లు, కట్ షాట్లతో ఇంగ్లీష్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 65 బంతుల్లో అర్ధశతకం.. 147 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసి కెరీర్లో 25వ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కానీ అప్పటికే ఆసీస్‌కు అవసరమైన పరుగులు వచ్చాయి.
శతక్కొట్టిన మ్యాథ్యూ వేడ్ ..