తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​ క్రికెటర్ పీటర్ సిడిల్ రిటైర్మెంట్​ - Siddile

ఆసీస్ పేసర్ పీటర్ సిడిల్ అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 67 టెస్టుల్లో 221 వికెట్లు పడగొట్టాడు.

Ausis Peter Siddile is Anounce his Retirement
పీటర్ సిడిల్

By

Published : Dec 29, 2019, 10:02 PM IST

ఆస్ట్రేలియా పేసర్‌ పీటర్‌ సిడిల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపికైన అతడికి రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కలేదు.

"వీడ్కోలుకు సరైన సమయం ఎప్పుడో తెలుసుకోవడం ఎంతో కష్టం. క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని గతంలో అనుకున్నా. కానీ, మరోసారి ఆసీస్‌ తరఫున ఆడాలని అనిపించింది. ఇటీవల యాషెస్‌లో ఆడాను. అది ఎంతో బాగుంది. వీడ్కోలుకు ఇదే సరైన సమయం అని అనిపిస్తుంది" -పీటర్ సిడిల్​.

2008లో మొహాలి వేదికగా భారత్‌తో ఆడిన తొలి టెస్టుతో సిడిల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మొదలుపెట్టాడు. తన తొలి వికెట్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ తెందుల్కర్‌ది. 2010లో తన పుట్టినరోజున అతడు హ్యాట్రిక్‌ సాధించాడు. ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించాడు. ఆసీస్‌ తరఫున అతడు 67 టెస్టులు, 20 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు 221 వికెట్లు, వన్డేల్లో 17 వికెట్లు, టీ20ల్లో మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చదవండి: మళ్లీ మైదానంలోకి ఎప్పుడొస్తానో తెలియదు: భువీ

ABOUT THE AUTHOR

...view details