ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమ్ఇండియా ఓటమిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. వరుసగా రెండు పరాజయాలు ఎదురైన నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు చేశాడు. స్టార్ పేసర్ బుమ్రాకు విరాట్, కొత్త బంతితో కేవలం రెండే ఓవర్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
"రెండో వన్డేలో కోహ్లీ కెప్టెన్సీ నాకు అర్థమే కాలేదు. ఆస్ట్రేలియా లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు ప్రధాన బౌలర్ బుమ్రాకు రెండు ఓవర్లే ఇవ్వడం ఏంట? సాధారణంగా ఓ బౌలర్‌కు 4-3-3 తరహాలో బౌలింగ్ ఇవ్వొచ్చు. లేదా గరిష్ఠంగా 4 ఓవర్ల వరకు బౌలింగ్ చేయించవచ్చు. కానీ, బుమ్రాకు కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ ఇవ్వడం వల్ల కెప్టెన్సీ ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలను. దానిని నేను అసలు వివరించలేను. ఇది టీ20 కాదు. నిజం చెప్పాలంటే ఇలాంటి కెప్టెన్సీని అస్సలు అంచనా వేయలేకపోతున్నాను"