లంచ్ విరామానికి టీమిండియా 72/2 - test
కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో లంచ్ విరామానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. మయాంక్, విరాట్ క్రీజులో ఉన్నారు.
మ్యాచ్
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు ఆరంభంలోనే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. హోల్డర్ వేసిన ఏడో ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్ (13) కార్న్‌వాల్ చేతికి చిక్కాడు. తర్వాత మయాంక్‌తో కలిసిన పుజారాను.. క్రీజులో కాస్త కుదురుకునే లోపే కార్న్‌వాల్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతానికి క్రీజులో మయాంక్(41), కోహ్లీ(5) ఉన్నారు. లంచ్ విరామానికి భారత్ 30 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.
Last Updated : Sep 28, 2019, 10:10 PM IST