2011 ప్రపంచకప్‌లో తాను ఎక్కువ మ్యాచ్‌లు ఆటటం వీలుకాలేదని టీమ్ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మరోవైపు హర్భజన్ సింగ్ కూడా జట్టులో ఉండటం వల్ల.. బ్యాలెన్స్ చేయడం కష్టమైందని పేర్కొన్నాడు. ఈ మెగా ఈవెంట్లో తమిళనాడు క్రికెటర్ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే ఆడాల్సి వచ్చింది. ఇటీవలే ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో ఫేస్బుక్ లైవ్‌చాట్‌లో మాట్లాడుతూ.. ప్రపంచకప్ అనుభవాలను పంచుకున్నాడు.
"2011 ప్రపంచకప్ చాలా బాగా గుర్తుంది. ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాను. జట్టులో హర్భజన్ ఉండటం వల్ల నాకు అవకాశం రాకుండా పోయింది. అయితే ఇప్పుడు టీమ్ఇండియా తరఫున మరో వరల్డ్‌కప్ ఆడాలని ఉంది. నాకే కాదు ప్రతి క్రికెటర్ ఇలానే అనుకుంటాడు. నాతో చాలా మంది అన్నారు. నేను జట్టులో ఆడితే భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని చెప్పారు"