సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్ల బ్యాట్లను రిపేర్ చేసిన.. బ్యాట్ మేకర్ అష్రఫ్ చౌదరికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన సబర్బన్ అంధేరిలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అష్రఫ్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెందూల్కర్ ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించి.. అష్రఫ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదికి మార్పించి చికిత్స అందించాలని కోరారు.
"అష్రఫ్‌కు చెంబూర్‌లోని ఆస్పత్రిలో చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ తేలింది. దీనిపై తెందూల్కర్ నాతో మాట్లాడారు. అతన్ని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి మార్చి.. ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించమని కోరారు. సచిన్ చెప్పినట్లుగానే చేసి.. అష్రఫ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం."