తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్: ఇంగ్లాండ్​ తొలి గెలుపు అందుకుంటుందా..! - స్టోక్స్

హెడింగ్లీ మైదానంలో యాషెస్​ మూడో టెస్టు గురువారం ప్రారంభం కానుంది. గాయంతో స్మిత్ ఈ మ్యాచ్​ నుంచి​ తప్పుకున్నాడు. ఈ అవకాశాన్ని అతిథ్య ఇంగ్లాండ్​ ఏ మేరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.

యాషెస్​ మూడో టెస్టు

By

Published : Aug 22, 2019, 7:01 AM IST

Updated : Sep 27, 2019, 8:30 PM IST

ప్రఖ్యాత యాషెస్​ మూడో టెస్టుకు రంగం సిద్ధమైంది. లీడ్స్​ వేదికగా గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు(భారత కాలమానం ప్రకారం) మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉంది ఆస్ట్రేలియా. తొలి టెస్టు ఆసీస్ గెలవగా, రెండో మ్యాచ్​ డ్రాగా ముగిసింది.

రెండో టెస్టు మ్యాచ్​లో ఆర్చర్ వేసిన​ బౌన్సర్​కు స్మిత్​ గాయపడ్డాడు. అతడు మూడో మ్యాచ్​కు అందుబాటులో ఉండట్లేదని ఆస్ట్రేలియా జట్టు ప్రకటించింది. ఇప్పుడు స్మిత్ లేని లోటు కంగారూలను కలవరపెట్టే అంశం. ఈ సిరీస్​లో బ్యాటింగ్​లో ఆసీస్​కు వెన్నెముకగా నిలిచిన స్మిత్​ లేకుండా ఆస్ట్రేలియా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

గత మ్యాచ్​లో గాయపడ్డ ఆసీస్​ ఆటగాడు స్టీవ్ స్మిత్

బ్యాటింగ్​లో బలహీనంగా ఉన్నా బౌలింగ్​లో మాత్రం కమిన్స్, హేజిల్​వుడ్, స్టార్క్​ లాంటి మ్యాచ్​ విన్నర్​లు ఉండటం ఆసీస్​కు కలిసొచ్చే అంశం.

మరోవైపు ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్. తొలి మ్యాచ్​లో ఓటమి అనంతరం పుంజుకున్న రూట్​సేన.. రెండో టెస్టును డ్రాగా ముగించింది. యువ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్​ అద్భుతమైన బౌలింగ్​ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ఇబ్బంది పెట్టింది.

ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్
ఇంగ్లీష్​ జట్టు టాప్​ ఆర్డర్​.. ప్రత్యర్థి జట్టు బౌలింగ్​ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతోంది. మిడిలార్డర్​ ఓ మెస్తరుగా రాణిస్తోంది. ప్రత్యర్థి జట్టులోకి కీలక బ్యాట్స్​మెన్​ స్మిత్​ గైర్హాజరును ఇంగ్లాండ్​ జట్టు ఈ మ్యాచ్​లో అవకాశంగా మలుచుకుంటుందా లేదా అనేది చూడాలి.
మూడో టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టు

ఇది చదవండి: యాషెస్​ : డ్రాగా ముగిసిన రెండో టెస్టు

Last Updated : Sep 27, 2019, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details