తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెలరేగిన ఆసీస్ పేసర్లు.. ఇంగ్లాండ్ 271/8 - ఓవల్

యాషెస్​ ఐదో టెస్టు తొలిరోజు ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది ఇంగ్లాండ్. క్రీజులో బట్లర్, లీచ్ ఉన్నారు. మిచెల్ మార్ష్​ 4 వికెట్లు తీశాడు.

తడబడిన ఇంగ్లాండ్.. ఆకట్టుకున్న ఆసీస్ బౌలర్లు​

By

Published : Sep 13, 2019, 7:24 AM IST

Updated : Sep 30, 2019, 10:18 AM IST

ఓవల్​ వేదికగా జరుగుతున్న యాషెస్​ ఐదో టెస్టులో తొలిరోజు ఇంగ్లాండ్​ తడబడింది. ఆసీస్ బౌలర్​ మిచెల్ మార్ష్​ విజృంభించడం వల్ల గురువారం ఆటముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​.. 27 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం మరో వికెట్​ పడకుండా జాగ్రత్తగా ఆడారు బర్న్స్, రూట్. 103/1తో మెరుగ్గా కనిపించిన ఆ జట్టును ఆస్ట్రేలియా బౌలర్లు ఇబ్బంది పెట్టారు. మార్ష్ 4 వికెట్లు తీశాడు. అతడికి తోడుగా కమిన్స్, హేజిల్​వుడ్​ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ఆసీస్ బౌలర్ మిచెల్ మార్ష్

ఓ సందర్భంలో 205/7తో కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్​ను.. బట్లర్​ ఆదుకున్నాడు. ఆర్చర్(9), లీచ్​ (10 నాటౌట్)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.64 పరుగులతో ప్రస్తుతం క్రీజులో కొనసాగుతున్నాడీ క్రికెటర్.

ఇప్పటికే 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఎలాగైనా ఈ మ్యాచ్​ గెలిచి సిరీస్​ పట్టేయాలని చూస్తోంది. అది జరిగితే దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్​ గడ్డపై యాషెస్ గెలిచిన ఆసీస్​ జట్టుగా నిలుస్తుంది.

ఇది చదవండి: కోహ్లీ పోస్ట్​.. ధోనీ రిటైర్మెంట్​కు సంకేతమా..!

Last Updated : Sep 30, 2019, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details