తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రేక్షకులు లేకుండానే మైదానాల్లో ఈలలు, గోలలు'

కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ సిరీస్​లు జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఖాళీ మైదానాల్లో మ్యాచ్​లు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఓ తెలివైన ఉపాయం చెప్పాడు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.

ఆర్చర్
ఆర్చర్

By

Published : May 14, 2020, 5:02 PM IST

కరోనా ప్రభావం కారణంగా ప్రపంచదేశాలు క్రీడల నిర్వహణపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే చాలా టోర్నీలు వాయిదా పడ్డాయి. ఇదే సమయంలో ప్రేక్షకులు లేకుండా టోర్నీలు నిర్వహించే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నారు. అయితే కొంతమంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా మరికొంత మంది వెనకేసుకొస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్​ ఓ సలహా ఇచ్చాడు. ప్రేక్షకుల గోలను ఆడియో రూపంలో ఏర్పాటు చేయాలంటూ చెప్పుకొచ్చాడు.

"క్రికెట్​ ఆడేటపుడు మైదానంలో మ్యూజిక్ పెడుతున్నాం. అదే ప్రేక్షకుల గోలను ఆడియో రూపంలో ఎందుకు పెట్టకూడదు. చప్పట్లు, ఈలలు, అరుపుల శబ్దాల మధ్య మైదానంలో నిజమైన ప్రేక్షకుల అనుభూతిని పొందవచ్చు."

-జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్

కరోనా ప్రభావం కారణంగా జులై 1 వరకు క్రికెట్ సిరీస్​లను రద్దు చేసింది ఈసీబీ. కానీ అక్కడ ఇంకా వైరస్ తీవ్రత తగ్గకపోవడం వల్ల టోర్నీలు ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.

ABOUT THE AUTHOR

...view details