తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ నిర్వహణ కీలకాంశంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్

పలు అంశాలపై బీసీసీఐ శుక్రవారం సమావేశం కానుంది. వర్చువల్​గా జరిగే ఈ మీటింగ్​లో ఐపీఎల్​ నిర్వహణ, టీమ్​ఇండియా భవిష్యత్ ప్రణాళికలపై చర్చించనున్నారు.

ఐపీఎల్ నిర్వహణ కీలకాంశంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్
ఐపీఎల్ నిర్వహణ కీలకాంశంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్

By

Published : Jul 16, 2020, 6:31 PM IST

Updated : Jul 16, 2020, 7:32 PM IST

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు రద్దయ్యాయి. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు మ్యాచ్​ల నిర్వహణకు మొగ్గుచూపుతున్నాయి. కానీ భారత్​లో ఇంకా వైరస్ ప్రభావం తగ్గలేదు. దీంతో ఇప్పటికే శ్రీలంక, జింబాబ్వేతో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరగాల్సిన సిరీస్​లు వాయిదా పడ్డాయి. ఐపీఎల్​ కూడా నిరవధిక వాయిదా పడింది. అయితే లీగ్​పై ఓ నిర్ణయానికి రావడానికి బీసీసీఐ సిద్ధమైంది. రేపు (శుక్రవారం) జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ సమావేశంలో వీటన్నింటిపై చర్చించనున్నారు. అందులో ముఖ్యంగా ఐపీఎల్, టీమ్​ఇండియా భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెట్టనున్నారు.

"మా వద్ద ఉన్న అన్ని అంశాలపై చర్చిస్తాం. ఐపీఎల్​ను భారత్​లో నిర్వహించడానికే మొగ్గు చూపే అవకాశం ఉంది. శ్రీలంక, యూఏఈ లీగ్​ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నా.. విదేశాల్లో జరిపితే భారం ఎక్కువవుతుంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు కూడా ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లోనూ ఐపీఎల్ వేదికలను ఖరారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ షెడ్యూల్ ఇంకా తెలియరావడం లేదు. టీ20 ప్రపంచకప్ రద్దయితే (అక్టోబర్​-నవంబర్​లో జరగాల్సి ఉంది) అప్పుడు లీగ్​ నిర్వహణపై మేము ముందుకెళతాం. "

-బీసీసీఐ సీనియర్ అధికారి

బీసీసీఐ బోర్డు మీటింగ్​ సోమవారం జరగనుంది. అందులో ఐపీఎల్​, టీమ్​ఇండియా భవిష్యత్ పర్యటనా ప్రణాళికలతో పాటు టీ20 ప్రపంచకప్​ నిర్వహణ కోసం పన్ను మినహాయింపు ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి.

టీమ్ఇండియా భవిష్యత్ పర్యటనల్లో భాగంగా ఇంగ్లాండ్​తో సెప్టెంబర్​లో స్వదేశంలో జరగాల్సిన ఇంగ్లాండ్ పర్యటనను ఫిబ్రవరికి వాయిదా వేసేందుకు బీసీసీఐ ఆలోచిస్తోంది. అలాగే వాయిదా పడ్డ శ్రీలంక, జింబాబ్వే పర్యటనలను కూడా రీషెడ్యూల్ చేయాల్సి ఉంది.

వీటితో పాటు దేశవాళీ క్రికెట్ పునరుద్ధరణ బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. రంజీ సీజన్​ సర్దుబాటుతో పాటు సయ్యద్ ముస్తక్ అలీ, విజయ్ హజారే, దులీప్ ట్రోఫీ నిర్వహణపై ఆలోచించనున్నారు అధికారులు. అలాగే ఆటగాళ్ల జెర్సీపై నైక్​ లోగో స్పాన్సర్​షిప్​ గడుపు ముగియనుంది. దీనిపై కొత్త టెండర్లు పిలిచే అంశంపై చర్చించనున్నారు. ఇటీవలే బోర్డు సీఈఓ పదవికి రాజీనామా చేసిన రాహుల్ జోహ్రీ స్థానంలో కొత్త అధికారి నియామకం చర్చకు రానుంది.

శుక్రవారం జరగబోయే సమావేశంలోని అజెండా

1) ఐపీఎల్ నిర్వహణ

2) దేశవాళీ క్రికెట్ రీషెడ్యూల్

3) ఇంగ్లాండ్ పర్యటనను ఫిబ్రవరిలో జరపడానికి ప్రణాళికలు

4) టీ20 ప్రపంచకప్ నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు సర్టిఫికేట్ పొందడం

5) బెంగళూరు ఎన్​సీఏలోని సౌకర్యాలు

6) బీసీసీఐ, ఐపీఎల్ డిజిటల్ ప్లాట్​ఫామ్​ల గడుపు పెంపు

7) బిహార్ క్రికెట్ అసోషియేషన్​లోని గొడవలు

8) బీసీసీఐలో కొత్త సిబ్బంది నియామకం

9) రాహుల్ జోహ్రీ స్థానంలో కొత్త సీఈఓ నియామకం

Last Updated : Jul 16, 2020, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details