తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2019, 2:27 PM IST

ETV Bharat / sports

ఐపీఎల్​ కోసమే అత్తారింటికి ఆమిర్..!

పాకిస్థాన్​ పేసర్​ మహ్మద్​ ఆమిర్​ టెస్టులకు రిటైర్మెంట్​ ప్రకటించిన తర్వాత కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్​ పాస్​పోర్ట్​ పొంది ఆ దేశంలోనే స్థిరపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడని సమాచారం.

ఐపీఎల్​ కోసమే ఆమిర్​ లండన్​కు మారుతున్నాడా..!

పాక్​ లెఫ్టార్మ్​ పేసర్​ మహ్మద్​ ఆమిర్​.. 27 ఏళ్లకే టెస్ట్​లకు రిటైర్మెంట్​ ప్రకటించి సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్లలో ఒకడైన ఈ ఆటగాడు.. మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బ్రిటన్​లో ఉండేందుకు ఆ దేశ పాస్​పోర్ట్​కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్​ నివాసిగా మారేందుకు ఆమిర్​ ప్రణాళికలు వేసుకొంటున్నట్లు పాక్​కు చెందిన ఓ వెబ్​సైట్​ కథనం ప్రచురించింది. ప్రస్తుతం లండన్​లో ఇల్లు కొనే పనిలో ఉన్నట్లు రాసుకొచ్చింది.

పాకిస్థాన్​ పేసర్​ మహ్మద్​ ఆమిర్​

భార్య లండన్​ భామ

2016లో ఆమిర్​.. బ్రిటన్​ వాసి నర్గీస్​ మాలిక్​ను వివాహమాడాడు. భార్యతో పాటు ఉండేందుకు స్పౌస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు​. ఈ వీసాతో రెండున్నరేళ్ల పాటు ఇంగ్లాండ్​లో ఉండేందుకు అనుమతి ఉంది. ఈ సమయంలో బ్రిటీష్​ పౌరసత్వం లభిస్తే ఆమిర్​ కెరీర్​కు చాలా లాభం కలగనుంది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​)లో ఆడే అవకాశం లభిస్తుంది. గతంలో అతడి వద్ద బ్రిటన్​ పాస్​పోర్ట్​ ఉండేది. 2010లో లార్డ్స్​లో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్ట్​ మ్యాచ్​లో ఆమిర్​ స్పాట్​ ఫిక్సింగ్​కు పాల్పడ్డాడు. ఆ కేసు విచారణ సమయంలో అతడి పాస్​పోర్ట్​ స్వాధీనం చేసుకున్నారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు.

భార్య నర్గీస్​, పాప మిన్సాతో ఆమిర్​

ఐపీఎల్​లో ఛాన్స్​..?

2008లో ముంబయిలో ఉగ్రదాడి తర్వాత పాక్​ ఆటగాళ్లకు వీసాలు ఇవ్వడానికి నిరాకరించింది బీసీసీఐ. ఇప్పటికీ పాకిస్థాన్​ ఆటగాళ్లకు ఐపీఎల్​లో ఆడే అవకాశం లేదు. ప్రస్తుతం ఆమిర్​ పాకిస్థాన్​లో ఆడినా పెద్దగా అభివృద్ధి చెందట్లేదని భావించి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్​ల్లో ఆడాలన్న ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే బ్రిటన్​లో శాశ్వత నివాసం ఏర్పరచుకొంటే అక్కడ పాస్​పోర్ట్​తో పాటు పౌరసత్వం లభించే అవకాశాలున్నాయి. ఫలితంగా ఐపీఎల్​లో ఆడేందుకూ ఛాన్స్​ ఉంటుంది.

ఐపీఎల్​ ట్రోఫీ

ABOUT THE AUTHOR

...view details