తెలంగాణ

telangana

ETV Bharat / sports

హైదరాబాద్​కు కెప్టెన్​గా అంబటి రాయుడు - ambati rayudu

ఇటీవలే రిటైర్మెంట్​ ప్రకటనను వెనక్కి తీసుకున్న తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు కొత్త బాధ్యతలు అప్పగించింది హెచ్​సీఏ. విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న హైదరాబాద్​ జట్టుకు కెప్టెన్​గా నియమించింది.

రాయుడు

By

Published : Sep 14, 2019, 5:31 PM IST

Updated : Sep 30, 2019, 2:37 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే వెనక్కు తీసుకుని ఆశ్చర్యపరిచాడు తెలుగు ఆటగాడు అంబటి రాయుడు. తాను మళ్లీ క్రికెట్‌ ఆడతానంటూ హెచ్‌సీఏకు లేఖ రాశాడీ ఆటగాడు. సానుకూలంగా స్పందించిన హెచ్​సీఏ త్వరలో జరగనున్న విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్​ జట్టుకు కెప్టెన్‌గా రాయుడిని నియమించింది.

రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకు తనకు క్రికెట్‌పై ఆసక్తి తగ్గలేదంటూ.. హెచ్‌సీఏకు లేఖ రాశాడు రాయుడు. తాను మళ్లీ క్రికెట్‌ ఆడటానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. తనకు అండగా నిలిచిన వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు.

హైదరాబాద్‌ విజయ్‌ హజారే ట్రోఫీ జట్టు

అంబటి రాయుడు(కెప్టెన్‌), బి సందీప్‌(వైస్‌ కెప్టెన్‌), అక్షత్‌ రెడ్డి, తన్మయ్‌ అగర్వాల్‌, ఠాకూర్‌ తిలక్ వర్మ, రోహిత్‌ రాయుడు, సీవీ మిలింద్‌, మెహదీ హసన్‌, సాకేత్‌ సాయి రామ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మిక్కిల్‌ జైస్వాల్‌, మల్లికార్జున్‌(వికెట్‌ కీపర్‌), కార్తీకేయ కక్‌, టి రవితేజ, అజయ్ దేవ్‌ గౌడ్‌

ఇవీ చూడండి.. ఆ ట్వీట్ నాకు పాఠం నేర్పింది: విరాట్

Last Updated : Sep 30, 2019, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details