పాకిస్థాన్‌కు చెందిన అంపైర్ అలీమ్ దార్ ప్రపంచరికార్డు సృష్టించాడు. రావల్పిండి వేదికగా ఆదివారం జరుగుతున్న పాకిస్థాన్-జింబాబ్వే మ్యాచ్‌తో అత్యధిక వన్డేలకు అంపైరింగ్ చేసిన వ్యక్తిగా ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాకు చెందిన రూడీ కోర్ట్జెన్ రికార్డును అధిగమించాడు. అంపైర్‌గా అలీమ్ దార్‌కు ఇది 210వ వన్డే.
జాబితాలో ఎవరెవరున్నారు?
అత్యధిక వన్డేలకు అంపైరింగ్ చేసిన జాబితాలో అలీమ్ దార్ తర్వాత కోర్ట్జెన్ (209), బిల్లీ బౌడెన్ (200), స్టీవ్ బక్నర్ (181), సైమన్ టౌఫెల్తో పాటు డారిల్ హార్పర్ (174)లు ఉన్నారు.
ఆల్‌రౌండర్‌గా కెరీర్ ప్రారంభం
పాకిస్థాన్ జట్టులో ఆల్‌రౌండర్‌గా పదేళ్లపాటు సేవలందించాడు అలీమ్ దార్. 2000లో పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌తో మొదటిసారి అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇప్పటివరకు 132 టెస్టులు, 46 టీ20లు, 210 వన్డేలకు ఈయన పనిచేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 387 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశాడు.
"ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు ఈ స్థాయికి చేరుకుంటానని అనుకోలేదు. ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదించా, నేర్చుకున్నా. ఈ విషయంలో నాకు సహకరించిన నా కుటుంబానికి, పాకిస్థాన్ బోర్డుకు, ఐసీసీకి కృతజ్ఞతలు."
-అలీమ్ దార్, అంపైర్
అలీమ్ దార్ ఈ ఘనత సాధించడంపై ఐసీసీ సీనియర్ మేనేజర్ శుభాకాంక్షలు తెలిపాడు. ఆయన యువతకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నాడు.