ప్రపంచకప్ తర్వాత జట్టుకు సరైన ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంపై సెలక్టర్లు దృష్టిసారించాలని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్ పర్యటన కోసం ప్రకటించిన జట్టులో అజింక్య రహానేను కేవలం టెస్టులకే పరిమితం చేయడంపై భారత జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీతో పాటు పలువురు అసహనం వ్యక్తం చేశారు. జట్టు విజయవంతం కావాలంటే మూడు ఫార్మాట్లకు స్థిరమైన ఆటగాళ్లు ఉండాలని చెప్పారు. స్పందించిన రహానే.. గంగూలీ వ్యాఖ్యలతో ఏకీభవీస్తున్నానని అన్నాడు.
"జట్టులో స్థిరంగా ఉండటం ముఖ్యం. మూడు ఫార్మాట్లకు కోర్ గ్రూప్ ఉంటే బాగుంటుంది. ఒక ఆటగాడికి సరైన అవకాశాలు లభిస్తే అతడిపై అతడికి నమ్మకం పెరుగుతుంది. అన్ని ఫార్మాట్లకు ఎంపికైతే బాధ్యత పెరిగి సరిగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. 3, 4 నెలలు ఆటకు దూరమైతే లయ దెబ్బతిని స్థిరత్వం లోపిస్తుంది. టెస్టు మ్యాచ్లు ఎవరైతే బాగా ఆడతారో వారు అన్ని ఫార్మాట్లలోనూ సత్తాచాటగలరు".
-అజింక్య రహానే, టీమిండియా ఆటగాడు