తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో అర్ధభాగం సంతృప్తినిచ్చింది: కోహ్లీ - bangaluru royal challengers

సీజన్​ను అనుకున్న స్థాయిలో పూర్తిచేయనప్పటికీ జట్టుగా గర్వంగా ఉందన్నాడు కోహ్లీ. వచ్చే సీజన్​లో మెరుగైన ప్రదర్శన చేస్తామని తెలిపాడు.

కోహ్లీ

By

Published : May 5, 2019, 12:32 PM IST

భారీ అంచనాలతో ప్రతిసారి ఐపీఎల్​లో బరిలోకి దిగుతూ అభిమానుల అంచనాల్ని అందులేకపోతున్న జట్లలో బెంగళూరు ముందుంటుంది. ఈసారి కూడా ప్లేఆఫ్ చేరకుండానే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ సీజన్​లో సంతృప్తికర ప్రదర్శనే చేశామని అన్నాడు సారథి కోహ్లీ.

మొదట వరుసగా ఆరు మ్యాచ్​ల్లో ఓడిన అనంతరం పుంజుకున్న మా జట్టు రెండో అర్ధభాగంలో అద్భుతంగా ఆడిందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఇదే ఆటను మొదటి భాగంలోనూ ఆడితే పరిస్థితులు మరోలా ఉండేవని అభిప్రాయపడ్డాడు.

"అనుకున్న స్థానంలో టోర్నీని ముంగిచలేకపోయాం. రెండో అర్ధభాగంలో మా ఆటతీరు మెరుగుపడింది. చివరగా ఆడిన 7 మ్యాచ్​ల్లో ఐదింటిలో విజయం సాధించాం, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ విజయాల పట్ల కాస్త గర్వంగా ఉంది. వచ్చే సీజన్​లో మెరుగైన ప్రదర్శన చేస్తాం. మాకు ఎల్లపుడూ మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు".
విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి ‘

శనివారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో విజయంతో ఈ సీజన్‌ను ముగించింది బెంగళూరు.

ఇవీ చూడండి.. అఫ్రిది 'గేమ్​ చేంజర్​'లో స్పాట్​ ఫిక్సింగ్​

ABOUT THE AUTHOR

...view details