తెలంగాణ

telangana

ETV Bharat / sports

'క్రికెటర్లు దేశవాళీ మ్యాచ్​ల్లో తప్పక ఆడాల్సిందే' - amir

పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ టెస్ట్​లకు గుడ్​ బై చెప్పిన తరుణంలో పీసీబీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టులో ఎంపిక కావాలంటే దేశవాళీ మ్యాచ్​ల్లో తప్పకుండా ఆడాల్సిందేనని స్పష్టం చేసింది.

ఆమిర్

By

Published : Jul 30, 2019, 7:15 AM IST

పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్​ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం ఇంగ్లాండ్ వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు(పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్​ల్లో తప్పకుండా ఆడాల్సిందేనని నిర్ణయించింది.

"మహ్మద్ ఆమిర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ దేశవాళీ మ్యాచ్​ల్లో ఆడాల్సి ఉంటుంది. జాతీయ జట్టులో ఎంపిక కావాలంటే ఇక్కడ(పాక్​) జరిగే దేశవాళీ టీ 20, వన్డేల్లో సత్తాచాటాలి. ఈ విధానం ద్వారే జాతీయ జట్టులోకి క్రికెటర్లను ఎంపిక చేస్తాం". -పీసీబీ ప్రతినిధి

ఆమిర్ భార్య నర్జీస్ బ్రిటన్​ పౌరురాలు. ఈ మేరకు యూకేకు వెళ్లి అక్కడి నుంచి ఐపీఎల్​లో ఆడేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్​లో పరాభవం తర్వాత పాక్ ప్రధాని ఇమ్రన్​ఖానే రంగంలోకి దిగారు. దేశవాళీ మ్యాచ్​ల నుంచి మొదలు జట్టులో క్రియాశీలక మార్పులు చేయనున్నారు.
ఇది చదవండి: పులిబిడ్డకు బారసాల.. హిమాదాస్​గా నామకరణం!

ABOUT THE AUTHOR

...view details