ప్రపంచకప్ నాలుగో మ్యాచ్‌లో నేడు అప్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. వరల్డ్‌కప్‌లో విజయవంతమైన జట్టుగా పేరొందిన ఆసీస్‌తో రెండోసారి మెగాటోర్నీ ఆడుతున్న అప్ఘాన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మొదట టాస్ గెలిచిన అప్ఘానిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఒకసారి తలపడగా.. ఆసీస్ 275 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వార్నర్ 178 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.