తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నాపై వార్తలు అవాస్తవం.. నేను బతికే ఉన్నా'

తను చనిపోయానంటూ వస్తున్న వార్తలపై స్పందిచాడు అఫ్గానిస్థాన్ క్రికెటర్ మహ్మద్ నబీ. బతికే ఉన్నానంటూ వివరణ ఇచ్చాడు.

మహ్మద్ నబీ

By

Published : Oct 6, 2019, 5:44 AM IST

ఇటీవలే టెస్టు ఫార్మాట్​ నుంచి వైదొలిగిన అఫ్గానిస్థాన్ క్రికెటర్ మహ్మద్ నబీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడు చనిపోయాడంటూ సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై స్పష్టత ఇచ్చింది అఫ్గాన్ క్రికెట్ బోర్డు. అతడు ప్రాక్టీస్ చేస్తున్న ఓ మ్యాచ్ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది.

"ఈ రోజు బిస్ ఈ ఐనిక్ నైట్స్ - బూస్ట్ డిఫెండర్స్ మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్​లోని కొన్ని ఫొటోలివే. షపాగీజా క్రికెట్​ లీగ్(ఎస్​సీఎల్​-2019)లో భాగంగా కాబుల్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్​ జరుగుతుంది" -అప్గానిస్థాన్ క్రికెట్ బోర్డు

ఈ విషయంపై మహ్మద్ నబీ కూడా క్లారిటీ ఇచ్చాడు. తను బతికే ఉన్నానంటూ ట్వీట్ చేశాడు.

"ప్రియమైన స్నేహితులారా! నేను బాగానే ఉన్నా. కొంతమంది నాపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు" -మహ్మద్ నబీ, అఫ్గాన్ క్రికెటర్

మూడు టెస్టులు ఆడిన మహ్మద్ నబీ 33 పరుగులు చేశాడు. ప్రస్తుతం వన్డేలు, టీ20 ఫార్మాట్​లో కొనసాగుతున్నాడు నబీ.

ఇదీ చదవండి: ఆఖరి రోజుకు మ్యాచ్.. విజయమా.. సమమా ?

ABOUT THE AUTHOR

...view details