భారత క్రికెట్ జట్టుపై దాడి చేస్తామంటూ వచ్చిన ఓ మెయిల్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కంగారుపెట్టింది. ఈ మెయిల్‌ను వెంటనే ఐసీసీకి పంపింపి పీసీబీ. బీసీసీఐకి ఓ కాపీ వచ్చింది. ఈ విషయంపై భారత క్రికెట్ బోర్డు అధికారి స్పందిస్తూ.. అది నకిలీ మెయిల్ అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. అక్కడ జట్టుపై దాడికి పాల్పడతామంటూ పీసీబీకి మెయిల్ వచ్చింది. బీసీసీఐకి సమాచారం అందిన వెంటనే ఈ విషయంపై హోంశాఖను సంప్రదించింది. ఆంటిగ్వాలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. చివరకు అది ఫేక్ మెయిల్ అని తేల్చింది.