తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ కౌంటీల్లో దుమ్మురేపిన డివిలియర్స్​ - మిడిల్​ఎసెక్స్ ఏబీ డివిలియర్స్​

అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పేసిన దక్షిణాఫ్రికా స్టార్​ బ్యాట్స్​మెన్​ ఏబీ డివిలియర్స్​ మళ్లీ బ్యాట్​ పట్టాడు. ఇంగ్లీష్​ కౌంటీ  టీ20 మ్యాచ్​లో బరిలోకి దిగిన ఈ డాషింగ్​ బ్యాట్స్​మెన్​...ఆరంభ మ్యాచ్​లోనే తనదైన రీతిలో చెలరేగి ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఫలితంగా అతడు ప్రాతినిధ్యం వహించిన మిడిలెసెక్స్​ జట్టు ప్రత్యర్థి ఎసెక్స్​పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఇంగ్లీష్​ కౌంటీలో దుమ్ములేపిన మిస్టర్​ 360

By

Published : Jul 19, 2019, 5:05 PM IST

దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్​ ఇంగ్లీష్​ కౌంటీలో ఆరంగేట్రంలోనే సత్తా చాటాడు. లండన్‌లోని లార్డ్స్​ వేదికగా జరిగిన దేశీయ టీ20లో మిడిల్​ఎసెక్స్​ తరఫున బరిలోకి దిగి... 43 బంతుల్లోనే 88 పరుగులు సాధించాడు. ఫలితంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్​లో ప్రత్యర్థి ఎసెక్స్​ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది మిడిలెసెక్స్​.

తొలుత బ్యాటింగ్​ చేసిన సిమన్​ హర్మర్​ సారథ్యంలోని ఎసెక్స్​ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది మిడిలెసెక్స్​. సారథి డేవిడ్​ మలన్​ 43 పరుగులు చేయగా... చివరి వరకు నాటౌట్​గా నిలిచిన డివిలియర్స్​ 88 (43 బంతుల్లో; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించాడు. అంతేకాదు 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​' కూడా 'మిస్టర్​ 360' సొంతమైంది.

అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా డాషింగ్​ ​బ్యాట్స్​మెన్ ఏబీడీ ఇటీవలి ప్రపంచకప్​లోనూ ఆడలేదు. మిడిలెసెక్స్‌ కౌంటీ క్లబ్‌ తరఫున డివిలియర్స్‌ 7 టీ20లు ఆడతాడని... అవసరమైతే మరిన్ని మ్యాచ్​లు ఆడే అవకాశం ఉందని ఆ జట్టు కోచ్‌ స్టువర్ట్‌ లా తెలిపాడు. డివిలియర్స్‌ ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐపీఎల్‌ సీజన్లలో పాల్గొన్నాడు. 2008 నుంచి ఇప్పటివరకూ 40 సగటుతో నాలుగు వేల పరుగులు చేయడం విశేషం.

ఇవీ చూడండి... డివిలియర్స్​ వస్తానన్నా.. వద్దన్నారు

ABOUT THE AUTHOR

...view details