కరోనా కారణంగా క్రికెటర్లు వారివారి కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఇంటివద్ద ఖాళీగా ఉన్న ఆరోన్ ఫించ్ అభిమానులతో ముచ్చటించాడు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఇందులో తన ఫేవరేట్ బౌలర్ల గురించీ ప్రస్తావించాడు. భారత్, పాకిస్థాన్ నుంచి తనకిష్టమైన బౌలర్ల పేర్లు చెప్పాడు.
"భారత్ నుంచి హర్భజన్ బౌలింగ్ ఇష్టం. తను స్పిన్ ద్వారా ఎన్నో వికెట్లు సాధించాడు. అలాగే పాకిస్థాన్ నుంచి ఆమిర్ బౌలింగ్ ఇష్టం. అతడు బౌలింగ్ వేస్తుంటే చూడటం బాగుంటుంది."