అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ రికార్డు నెలకొల్పాడు. పాకిస్థాన్‌తో జరిగిన మొదటి టీ20లో సిక్సర్ బాదడం ద్వారా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 200 సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఫించ్ 181 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా అఫ్రిదీ (214), రోహిత్ శర్మ (242) తర్వాత స్థానాల్లో ఉన్నారు.
ఆసీస్ సారథి ఫించ్ టీ20ల్లో రికార్డు - Aaron Finch new record in t20s
ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 200 సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
ఫించ్
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారింది. ఫలితంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 107 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 3.1 ఓవర్లలోనే 41 పరుగులు వద్ద ఉన్నప్పుడు మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. ఈ కారణంగా మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. వార్నర్ (2), ఫించ్ (37) క్రీజులో ఉన్నారు.
ఇవీ చూడండి.. దూబే... యువరాజ్‌లా ఆడుతున్నాడే..