టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. తనకిష్టమైన క్రికెట్ షాట్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఐపీఎల్లో హైదరాబాద్ తరఫున ఆడుతూ కోల్‌కతాపై కవర్స్ వైపు సిక్స్ కొడుతూ ఇందులో కనిపించాడు యువీ. "ఫాస్ట్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా సిక్స్ బాదటం చాలా కష్టం. కానీ నేను కొట్టాను. నా మొత్తం కెరీర్లోనే అత్యంత్య ఇష్టమైన షాట్ ఇది" అని రాసుకొచ్చాడు.
ఈ వీడియోపై స్పందించిన టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ "క్లాస్ విత్ పవర్" అంటూ అభివర్ణించాడు. ఇతడితో పాటే మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్.. యువరాజ్‌ను అభినందించారు.