తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20ల్లో తొలిసారి: ఐదుగురు బ్యాట్స్​మెన్ 'హాఫ్​' సెంచరీలు

భారత్​-న్యూజిలాండ్​ మధ్య జరిగిన తొలి టీ20లో అరుదైన ఘనత చోటు చేసుకుంది. ఆక్లాండ్​లోని ఈడెన్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో.. ఇరుజట్లలోని ఐదుగురు బ్యాట్స్​మెన్​ అర్ధశతకాలతో మెరిశారు. పొట్టి ఫార్మాట్​లో ఇంతమంది ఒకేసారి 'హాఫ్​' సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.

5 fifties in a T20I match
టీ20ల్లో ప్రపంచ రికార్డు: తొలిసారి ఐదుగురు 'హాఫ్​' సెంచరీలు

By

Published : Jan 25, 2020, 6:33 AM IST

Updated : Feb 18, 2020, 8:01 AM IST

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో.. 6 వికెట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసింది భారత్​. ఈ మ్యాచ్​లో ఇరుజట్లు రెండొందల పై చిలుకు పరుగులు చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డూ నమోదైంది. ఇరుజట్లలో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ అర్ధశతకాలు సాధించారు. టీ20 చరిత్రలో ఇలా ఓ మ్యాచ్‌లో ఐదుగురు 50కి పైగా పరుగులు చేయడంన ఇదే తొలిసారి.

న్యూజిలాండ్​ ఆటగాళ్లలో కొలిన్​ మున్రో(59; 42 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), కేన్‌ విలియమ్సన్‌(51; 26 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), రాస్‌ టేలర్‌(54; 27 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుతంగా ఆడి అర్ధసెంచరీలు సాధించారు.టీమిండియా బ్యాట్స్‌మెన్​లో కేఎల్‌ రాహుల్‌(56; 27 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(58; 29 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు.

టీ20ల్లో ప్రపంచ రికార్డు: తొలిసారి ఐదుగురు బ్యాట్స్​మన్లు 'హాఫ్​' సెంచరీలు

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ జట్టు 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగా, టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్​లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (45; 32 బంతుల్లో 3x4, 1x6) ధాటిగా ఆడినా త్రుటిలో అర్ధ శతకాన్ని కోల్పోయాడు. లేకుంటే ఒకే మ్యాచ్‌లో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ అర్ధ శతకాలు సాధించిన టీ20గా నిలిచేది.

ఛేదనలో టీమిండియానే టాప్‌..

అంతర్జాతీయ టీ20ల్లో 200కు పైగా పరుగులను అత్యధిక సార్లు ఛేధించిన జట్టుగా టీమిండియా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఈ ఫీట్​ సాధించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌లు ఒక్కోసారి మాత్రమే రెండొందలకుపైగా టార్గెట్‌ను ఛేదించాయి.

2009లో మొహాలీ వేదికగా శ్రీలంకపై 207 పరుగులు, 2013లో రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 202 పరుగులు, 2019లో హైదరాబాద్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో 208 పరుగుల లక్ష్యాన్ని... టీమిండియా ఛేదించింది.

Last Updated : Feb 18, 2020, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details