తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాణించిన గప్తిల్, టేలర్​.. భారత్​ లక్ష్యం 274

ఆక్లాండ్‌ వేదికగా భారత్​తో రెండో వన్డేలో మంచి స్కోరు చేసింది న్యూజిలాండ్‌. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు సాధించింది. కివీస్​ బ్యాటింగ్​లో గప్తిల్​, టేలర్​​ రాణించారు.

By

Published : Feb 8, 2020, 11:17 AM IST

Updated : Feb 29, 2020, 3:00 PM IST

New Zealand vs India, 2nd OD
రాణించిన గప్తిల్

టీమిండియాతో జరుగుతోన్న రెండో వన్డేలో కివీస్​ జట్టు మంచి స్కోరు సాధించింది. కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్​లో భారత బౌలర్లు పట్టు బిగించినా... ఆఖర్లో పరుగులిచ్చుకున్నారు. ఫలితంగా కివీస్​ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 273 పరుగులు​ చేసింది. న్యూజిలాండ్​ బ్యాట్స్​మెన్​లో గప్తిల్​, నికోలస్​ ఆకట్టుకోగా.. ఆఖర్లో టేలర్​ చెలరేగాడు.

గప్తిల్​ అర్ధశతకం...

చాలా రోజులుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న న్యూజిలాండ్​ ఓపెనర్​ మార్టిన్​ గప్తిల్​ ఈ మ్యాచ్​లో ఆకట్టుకున్నాడు. ఎట్టకేలకు 11 ఇన్నింగ్స్​ల తర్వాత హాఫ్​ సెంచరీ సాధించాడు. కెరీర్లో 36వ వన్డే అర్ధశతకం నమోదుచేసుకున్నాడు. చివరికి 79 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్​ చేరాడు. ఇతడికి మరో ఓపెనర్​ హెన్రీ నికోల్స్ ​(41) మంచి తోడ్పాటునిచ్చాడు. ఆరంభంలో అదరగొట్టిన కివీస్​ బ్యాట్స్​మెన్​.. తర్వాత చేతులెత్తేశారు. భారత బౌలర్లు కీలక విరామాల్లో వికెట్లు తీసి పరుగులు నియంత్రించారు. మొదట్లో నిదానంగా ఆడిన టేలర్​ (73*) ఆఖర్లో చెలరేగి మరో హాఫ్​ సెంచరీ సాధించాడు.

భారత బౌలర్లలో చాహల్​ 3 వికెట్లు సాధించాడు. శార్దూల్​ 2, జడేజా ఓ వికెట్​ ఖాతాలో వేసుకున్నారు. సైనీ పొదుపుగా బౌలింగ్​ చేశాడు.

Last Updated : Feb 29, 2020, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details