తెలంగాణ

telangana

ETV Bharat / sports

2023 ప్రపంచకప్​ కోసం అప్పుడే ప్లాన్ వేశాడు! - 2021 టీ20 ప్రపంచకప్

లాక్​డౌన్​ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఆసీస్ సారథి ఫించ్.. రాబోయే టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్​ల కోసం అప్పుడే ప్లాన్​లు వేశాడు. విజయం సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు.

Finch's
ఫించ్

By

Published : Jun 27, 2020, 11:20 AM IST

Updated : Jun 27, 2020, 2:21 PM IST

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారథి ఆరోన్​ ఫించ్​.. ఈ సమయాన్ని అసలు వృథా చేయట్లేదని చెప్పాడు. తాను క్రికెట్​ ఆడకపోయినా సరే తన మెదడులో మాత్రం నిరంతరాయంగా ఆట గురించే ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. మ్యాచ్​ల్లో గెలుపు కోసం వ్యూహాలు రచించడానికి, ఈ సమయాన్ని కేటాయించినట్లు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్​ను ముద్దాడం కోసం ఇప్పటినుంచే ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయడానికి గ్రౌండ్​ వర్క్​ చేస్తున్నట్లు వెల్లడించాడు. వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​పైనా దృష్టి సారించినట్లు స్పష్టం చేశాడు.

"ఓ క్రికెట్​ అభిమానిగా 2021 టీ20 ప్రపంచకప్​, 2023 వన్డే ప్రపంచకప్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఓ సారథిగా ఆ టోర్నీల్లో విజయం సాధించేందుకు పూర్తిస్థాయిలో ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి? ఏ వ్యూహాలు రచించాలి? అనే విషయమై నిరంతరం ఆలోచిస్తున్నాను. అందుకు తగ్గట్లు గ్రౌండ్​వర్క్​ చేస్తున్నా. ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యర్థుల్ని ఎలా మట్టికరిపించాలో ప్లాన్ వేస్తున్నా"

-ఆరోన్​ ఫించ్​, ఆసీస్​ జట్టు కెప్టెన్

ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్​లో ఐదుసార్లు విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా.​ గతేడాది ఇంగ్లాండ్​లో జరిగిన ప్రపంచకప్​లో సెమీఫైనల్​లో ఓడిపోయింది.

ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో ఆస్ట్రేలియా వేదికగానే టీ20 ప్రపంచకప్​ జరగాలి. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో జరిగేది సందేహంగా మారింది. ఈ విషయమై ఐసీసీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఈ టోర్నీ రద్దయితే అదే సమయంలో ఐపీఎల్​ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

ఇది చూడండి : 'మీలో పదిమంది అయినా భారత్​ జట్టులోకి రావాలి'

Last Updated : Jun 27, 2020, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details