తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కొత్త ఏడాది ఏం మారదు.. మీకు గుర్తుచేస్తున్నానంతే'

2020కి స్వాగతం పలుకుతూ పలువురు భారత క్రికెటర్లు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అందులో సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కాస్త భిన్నంగా విష్ చేశాడు. మారేది క్యాలెండర్​ మాత్రమేనని అన్నాడు.

'కొత్త ఏడాది ఏం మారదు.. మీకు గుర్తుచేస్తున్నానంతే'
భారత క్రికెటర్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

By

Published : Jan 1, 2020, 10:52 AM IST

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. 2019, గత దశాబ్దానికి వీడ్కోలు చెప్పి.. కొత్త ఏడాదికి ప్రజలంతా నూతనోత్సహంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత క్రికెటర్లు, మాజీలు.. సోషల్​ మీడియా వేదికగా దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. -విరాట్ కోహ్లీ

మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. - వీరేంద్ర సెహ్వాగ్‌

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో అంతా మారిపోతుందని ఉత్సాహపడకండి. మారేది కేవలం క్యాలెండర్‌ మాత్రమే. మీ భాగస్వామి, ఉద్యోగం, లక్ష్యాలు ఏమీ మారవు. ఇది మీకు గుర్తుచేస్తున్నానంతే. -హర్భజన్‌ సింగ్‌

జయం దిశగా అడుగులు వేసేటప్పుడు ఎంతో దృఢంగా ఉండండి. మార్గం మధ్యలో ఎదురయ్యే కష్టాలు.. గెలిచిన తర్వాత వచ్చే ఆనందం కంటే ఎంతో చిన్నవి. అభిమానులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. - మహ్మద్‌ షమి

మీకు, మీ ఆత్మీయులకు ఆ భగవంతుడు శాంతి, ఆనందాన్ని అందిస్తాడని ఆశిస్తున్నా. కొత్త జీవితం, ఉజ్వల భవిష్యత్తుకు స్వాగతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. - వీవీఎస్‌ లక్ష్మణ్‌

గత దశాబ్దానికి, 2019కి వీడ్కోలు. కొత్త ఏడాదికి ఘన స్వాగతం. ఈ నూతన దశాబ్దంలో ప్రపంచానికి దయ, ప్రేమను పంచడానికి మనం శ్రమించాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. -సురేశ్‌ రైనా

ABOUT THE AUTHOR

...view details