తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: ముగ్గురు మొనగాళ్లు అదరగొడితే... - crickety

ప్రపంచకప్​లో భారత్​కు టాప్ ఆర్డర్ కీలకం కానుంది. రోహిత్, ధావన్, కోహ్లీ సత్తాచాటితే మెగాటోర్నీలో టీమిండియాకు తిరుగుండదని చెప్పొచ్చు.

రోహిత్

By

Published : May 25, 2019, 10:25 AM IST

భారత జట్టు మూడోసారి ప్రపంచకప్​ గెలవాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్​లో అడుగుపెట్టింది. మెగాటోర్నీలో మొదటిసారి అత్యుత్తమ బౌలింగ్​ దళంతో బరిలోకి దిగబోతోంది. బ్యాటింగ్​లో మాత్రం టాప్ ఆర్డర్​పైనే అందరి దృష్టి నెలకొంది.

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలు సత్తాచాటాలని భావిస్తున్నారు అభిమానులు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వీరు ముగ్గురు జట్టుకు వెన్నెముకగా మారారు. వీరి ఫామ్, ప్రదర్శనే టీమిండియాకు ట్రోఫీని అందించగలదని విశ్లేషకులు అభిప్రాయం. స్టాండ్​బై ఓపెనర్​గా ఉన్న రాహుల్ కూడా అవసరమున్న సమయంలో రాణించగలడు.

అత్యుత్తమ ఓపెనింగ్ జోడి
ప్రస్తుతం భారత ఓపెనర్లు ధావన్, రోహిత్ ప్రపంచంలోని మేటి బ్యాట్స్​మెన్​గా గుర్తింపు పొందారు. రోహిత్ కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. హిట్​మ్యాన్ అండతో మొదటినుంచే ప్రత్యర్థిపై దాడి చేయగలడు ధావన్. పిచ్​ను, పరిస్థితుల్ని బట్టి మంచి అవగాహనతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగలరు. 2018లో వీరిద్దరూ కలిసి 4,586 పరుగులు సాధించారు.

రోహిత్, ధావన్

రన్​ మెషీన్ కోహ్లీ
మూడో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చే కోహ్లీ సుదీర్ఘ ఇన్నింగ్స్​లు ఆడటంలో దిట్ట. జట్టు కష్టాల్లో ఉన్నపుడు, ఒత్తిడి సమయంలో మంచి ప్రదర్శన చేయగలడు. అవలీలగా శతకాలు సాధిస్తూ ప్రపంచ క్రికెట్​లో అగ్రస్థాయి బ్యాట్స్​మన్​గా ఎదిగాడు. ఛేదనలో మాస్టర్​గా పేరొందాడు. ఓపెనర్లకు తోడు కోహ్లీ చక్కని ఇన్నింగ్స్​ ఆడితే టీమిండియాకు తిరుగుండదు.

కోహ్లీ

2015 నుంచి చూసుకుంటే టీమిండియా వీరి ముగ్గురిపైనే ఎక్కువగా ఆధారపడింది. భారీ భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టుకు విజయాలను అందించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పిచ్​లు బ్యాట్స్​మెన్​కు అనుకూలించేలా ఉన్నాయి. భారత టాప్ ఆర్డర్ త్రయం మంచి ప్రదర్శన చేస్తే ప్రపంచకప్ ట్రోఫీ భారత్​దే అని అంటున్నారు క్రికెట్ పండితులు.

ఇవీ చూడండి.. WC19: '350 కాదు... 250 మంచి స్కోరే'

ABOUT THE AUTHOR

...view details