తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇంగ్లాండ్ జట్టు ఫేవరేట్.. ఆసీస్ ఫైనల్​కు వెళ్లొచ్చు' - india

ఇంగ్లాండ్​ జట్టుకు ప్రపంచకప్​ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్​ మెక్​గ్రాత్. భారత్​, ఆస్ట్రేలియా జట్లు కూడా బలంగా ఉన్నాయని చెప్పాడు.

మెక్ గ్రాత్

By

Published : May 27, 2019, 8:31 PM IST

ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ప్రపంచకప్​నుఇంగ్లాండ్​​ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం మెక్​గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్​ ఫైనల్​ వరకు వెళ్తుందని అంచనా వేశాడు.

వన్డేల్లో మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లాండ్, కోహ్లీ సారథ్యంలోని భారత్ మంచి ప్రదర్శన చేస్తున్నాయని తెలిపాడు మెక్​గ్రాత్. అన్ని జట్లు మొదటి 15, చివరి 15 ఓవర్లలో ఎక్కువ పరుగులు సాధించడానికి ప్రయత్నిస్తాయని.. కానీ 50 ఓవర్లూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగల సత్తా ఇంగ్లాండ్​, భారత్​ జట్లకు ఉందని అన్నాడు.

ఇంగ్లాండ్

"ప్రస్తుత జట్లను చూస్తే ఇంగ్లాండ్ మంచి ఫామ్​లో ఉంది. భారీ స్కోర్లు సాధిస్తోంది. సొంత మైదానాల్లో ఆడటం వారికి కలిసొచ్చే అంశం. ఆసీస్ కూడా మంచి ప్రదర్శన చేస్తుందని ఆశిస్తున్నా. ఫించ్ సారథ్యంలోని కంగారూ జట్టు ఫైనల్​ వరకు వెళ్లొచ్చు".
- మెక్​గ్రాత్, ఆస్ట్రేలియా మాజీ పేసర్

దక్షిణాఫ్రికా మంచి జట్టని తెలిపిన మెక్​గ్రాత్.. వెస్టిండీస్, పాకిస్థాన్ తమదైన రోజున సత్తాచాటగలవని స్పష్టం చేశాడు. ఆ జట్లకు స్థిరత్వం లోపించడం పెద్ద సమస్యని అన్నాడు. ఇంగ్లాండ్, భారత్​ బలమైన జట్లుగా బరిలో దిగుతున్నాయని వ్యాఖ్యానించాడీ మాజీ ఫాస్ట్ బౌలర్.

ఆస్ట్రేలియా

ABOUT THE AUTHOR

...view details