తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​లో కొత్త రూల్స్​.. ఇకపై మన్కడింగ్ కాదు రనౌట్​!

cricket new rules: క్రికెట్​లో కొన్ని కీలకమైన మార్పులను తీసుకొచ్చింది ఎంసీసీ. ఇకపై మన్కడింగ్​ను రనౌట్​గా పరిగణించాలని ఎంసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మరికొన్ని రూల్స్ తెచ్చింది. అవేంటంటే?

మన్కడింగ్​ బ్యాన్​
mankading banned

By

Published : Mar 9, 2022, 11:37 AM IST

Updated : Mar 10, 2022, 1:31 PM IST

cricket new rules: క్రికెట్​లో కొత్త రూల్స్​ రానున్నాయి. అవి ఈ ఏడాది అక్టోబరు నుంచి అమలు కానున్నాయి. మన్కడింగ్​ను రనౌట్​గా పరిగణిస్తామని మెరిల్​బోర్న్​ క్రికెట్​ క్లబ్​ వెల్లడించింది. దీంతో పాటు మరికొన్ని కొత్త నియమాలను ఎంసీసీ ప్రకటించింది. వాటినీ పరిశీలించండి..

మన్కడింగ్‌ అంటే ఏంటి?

mankading banned by mcc: బౌలర్‌ బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్​ క్రీజు దాటితే సదరు బౌలర్‌ అతడిని ఔట్‌ చేసే అవకాశాన్ని మన్కడింగ్‌ అంటారు. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉండే ఏ బ్యాటర్‌ అయినా పరుగు కోసం సిద్ధంగా ఉంటారు. అందుకు కొన్ని సార్లు క్రీజు దాటే అవకాశం ఉంటుంది. ఇకపై బౌలర్‌ మన్కడింగ్‌ను రనౌట్​ కింద పరిగణిస్తామని ఎంసీసీ తెలిపింది.

క్యాచ్​ ఔట్​లో చిన్న మార్పు..

మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో క్యాచ్‌ ఔట్‌కు సంబంధించి ఎంసీసీ చిన్న సవరణ చేసింది. ఫీల్డర్‌.. క్యాచ్‌ పట్టడానికి ముందు ఇద్దరు బ్యాటర్లు క్రీజు దాటితే.. ఇకపై క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్‌ ఎండ్‌వైపు వెళ్లాలి.

వైడ్​ బాల్​గానే..

ఇకపై స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ నిలుచున్న స్థానం నుంచి బంతి కొద్ది దూరంలో వెళ్లినా.. దానిని వైడ్​గా పరిగణించాలనే కొత్త రూల్‌ను ఎంసీసీ అమల్లోకి తేనుంది.

సలైవా ఉపయోగించవద్దు..

బంతిని షైన్‌ చేసేందుకు బౌలర్లు సలైవా(ఉమ్మి) ఉపయోగించకూడదని కరోనా సమయంలో ఎంసీసీ తెలిపింది. అయితే ఇప్పుడు సలైవాను పూర్తిగా ఉపయోగించవద్దని ఎంసీసీ పేర్కొంది. సలైవా బాల్​కు అప్లై చేస్తే టాంపరింగ్​కు పాల్పడే అవకాశం ఉన్నందున నిషేధించామని తెలిపింది.

రిప్లేస్​ చేస్తే..

ఏదైనా సందర్భంలో జట్టులో ఒక ఆటగాడికి బదులు మరో ఆటగాడిని రిప్లేస్​ చేస్తే..ముందు ఉన్న ఆటగాడికి సంబంధించిన ఆంక్షలు​, జరిమానాలు మొదలగువన్నీ కొత్తగా వచ్చిన ఆటగాడికే చెందుతాయని ఎంసీసీ పేర్కొంది.

అది డెడ్​బాలే..

కొన్ని సందర్భాల్లో మ్యాచ్​ జరుగుతున్న సమయంలో గ్రౌండ్​లోకి జంతువులు గానీ, మనుషులు గానీ వస్తే.. అప్పుడు బౌలర్​ వేసిన బంతిని డెడ్​ బాల్​గా పరిగణించాలని ఎంసీసీ తెలిపింది. కట్‌స్ట్రిప్‌ దాటిన బంతిని బ్యాటర్​ టచ్‌ చేసే విషయంలోనూ కొత్త రూల్​ను తీసుకొచ్చింది.

ఇదీ చదవండి: బౌన్సర్లను నిషేధించాల్సిన అవసరం లేదు: ఎంసీసీ

Last Updated : Mar 10, 2022, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details