Cricket Lessons Rohit Sharma: గాయాల కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తిరిగి ఫిట్నెస్ పొందేందుకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి వెళ్లాడు.
రోహిత్ శర్మను సలహాలు అడిగి తెలుసుకుంటున్న క్రికెటర్ ఈ క్రమంలో అక్కడ శిక్షణ పొందుతున్న అండర్-19 ఆటగాళ్లను కలిశాడు హిట్ మ్యాన్. వారికి క్రికెట్ పాఠాలు చెప్పాడు. వారితో అనేక విషయాలు పంచుకున్నాడు.
ఆసియా కప్ నేపథ్యంలో..
Asia Cup 2021 Cricket: ఈ నెల 23 నుంచి యూఏఈలో ఆసియా కప్ జరగనున్న నేపథ్యంలో అండర్-19 క్రికెటర్లకు విలువైన సలహాలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ పాఠాలు వెలకట్టలేనివని ట్వీట్ చేసింది. అయితే రోహిత్.. గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు వారాలు పట్టొచ్చని వైద్య బృందం పేర్కొంది. అయితే.. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు రోహిత్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
కుర్రాళ్లకు సలహాలు ఇస్తున్న రోహిత్ ఇక ఆల్ రౌండర్ జడేజా కూడా గాయం కారణంగా ప్రస్తుతం ఎన్సీఏలోనే ఉన్నాడు. జడేజా కోలుకోవడానికి ఎక్కువ సమయమే పట్టొచ్చని సమాచారం.
ఇదీ చూడండి:దక్షిణాఫ్రికాకు టీమ్ఇండియా.. ఎన్సీఏలో రోహిత్, జడ్డూ