తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL: ఐపీఎల్​పై చీర్​లీడర్​ షాకింగ్​ కామెంట్స్​ - ఐపీఎల్​ పార్టీలు

ఐపీఎల్ పార్టీలపై ముంబయి ఇండియన్స్​ చీర్​ లీడర్​ గాబ్రియెల్లా పాస్క్వాలోట్టో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చీర్​ లీడర్ బృందం నుంచి తొలగించిన చాలాకాలం తర్వాత మరోసారి ఐపీఎల్ మేనేజ్​మెంట్​పై విరుచుకుపడ్డారు.

cheerleader Gabriella Pasqualotto
గాబ్రియెల్లా పాస్క్వాలోట్టో

By

Published : Jul 15, 2021, 3:01 PM IST

ముంబయి ఇండియన్స్​ చీర్​ లీడర్​ గాబ్రియెల్లా పాస్క్వాలోట్టో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. చీర్​ లీడర్ బృందం నుంచి తొలగించిన చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి ఐపీఎల్​ మేనేజ్​మెంట్​పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. క్రికెటర్లు తమతో అసభ్యంగా ప్రవర్తించడంపై గతంలో తన బ్లాగ్​లో రాసిన వివరాలు నిజమేనని, యాజమాన్యం కూడా ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.

"నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయినా నన్ను చీర్​ లీడర్​ బృందం నుంచి తొలగించారు. పార్టీల్లో మమ్మల్ని ఓ మాంసం ముద్దగానే చూసేవారు. నేను ఎవరో చెప్పిన విషయాలు నా బ్లాగ్​లో రాయలేదు. బాహుశా.. నాపై ఫిర్యాదు చేసిన క్రికెటర్​కు దోషిననే భావన కలిగి ఉండవచ్చు" అని గాబ్రియెల్లా చెప్పుకొచ్చారు.

ఐపీఎల్​ చీర్​ లీడర్​ గాబ్రియెల్లా.. మొదట '@ఐపీఎల్​ గర్ల్' అనే పేరుతో ఉన్న ట్విట్టర్​ ఖాతాలో తన అనుభవాలను తెలిపేది. అనంతరం ఆమె ఒక గుర్తుతెలియని వ్యక్తి పేరుతో ఓ బ్లాగ్​ను నిర్వహించింది. అందులో ఐపీఎల్​ పార్టీలు, క్రికెటర్ల గురించి తన అభిప్రాయాలను షేర్​ చేసేది. గాబ్రియెల్లా నిర్వహిస్తున్న బ్లాగ్​ గురించి ఓ క్రికెటర్​కు ఎవరో​ ఫిర్యాదు చేయగా.. ఆమెను చీర్​ బృందం నుంచి తొలగించినట్లు సమాచారం.

ఇదీ చదవండి:పంత్​కు కరోనా.. అక్కడికి వెళ్లడం వల్లేనా?

ABOUT THE AUTHOR

...view details