Chahal Daniel Vetori: తాను నాణ్యమైన స్పిన్నర్‌గా ఎదిగేందుకు న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ డేనియల్ వెటోరీ చాలా సహకారం అందించాడని అన్నాడు లెగ్ స్పిన్నర్ చాహల్. అందుకే తాను ఇనేళ్లుగా మెరుగ్గా రాణించగలుగుతున్నట్లు తెలిపాడు.
"2014లో నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎంపికైన సమయంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు డేనియల్ వెటోరీ హెడ్ కోచ్‌గా ఉండేవాడు. నేను నాణ్యమైన స్పిన్నర్‌గా ఎదిగేందుకు అతడు చాలా సహకారం అందించాడు. ఒక బౌలర్‌గా, అనుభవమున్న క్రికెటర్‌గా నాకు చాలా సలహాలు చెప్పాడు. నా బౌలింగ్ యాక్షన్ మార్చుకోకుండా బంతిని ఎలా వేయాలనే విషయంపై కొన్ని సూచనలు చేశాడు. నాతో నెట్స్‌లో అదనపు ఓవర్లు బౌలింగ్ చేయించేవాడు. నేను మరింత మెరుగయ్యేందుకు అది ఉపయోగపడింది. 3-4 మ్యాచులు ఆడిన తర్వాత నేను బౌలింగ్ చేసిన వీడియోలను పంపేవాడు. ఏమైనా మార్పులు ఉంటే చెప్పేవాడు" అని చాహల్ అన్నాడు.
"ఐపీఎల్‌లో 14 మ్యాచులుంటాయి. అందులో 3, 4 మ్యాచుల్లో విఫలమైనా, మిగతా మ్యాచుల్లో మాత్రం కచ్చితంగా మెరుగ్గా రాణించాలి. ఎకానమీ కూడా 7 లోపే ఉండేలా చూసుకోవాలి. మణికట్టుతో మ్యాజిక్ చేయాలి. బంతిని రిలీజ్ చేసే సమయంలో మణికట్టు స్థానాన్ని మార్చి.. ప్రత్యర్థి బ్యాటర్‌ను తికమక పెట్టాలని చెప్పేవాడు. ఇప్పటికీ నేను ఇదే విషయాన్ని అనుసరిస్తున్నాను" అని చాహల్ చెప్పాడు. ఐపీఎల్‌లో చాహల్ ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
తొలి సంపాదనతో కారు కొన్నాను
ఐపీఎల్ వేలంలో తొలిసారి దక్కిన డబ్బుతో.. ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నానని హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు.