Azadi Amruth Mahostav Cricket match: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. ఆగస్టు 22న క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు ఒక జట్టుగా విదేశాలకు చెందిన ప్రముఖ ఆటగాళ్లు మరో జట్టుగా మ్యాచ్ నిర్వహించాలని కేంద్రం కోరింది. ఈ మ్యాచ్ నిర్వహణపై బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు తెలిపారు. ఇండియా లెవన్, వరల్డ్ లెవన్ మధ్య ఆగస్టు 22న మ్యాచ్ నిర్వహించాలని.. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ప్రతిపాదన వచ్చిందని బోర్డు వర్గాలు తెలిపాయి.
ఇండియా ఓవైపు.. ప్రపంచమంతా మరోవైపు.. క్రికెట్ మ్యాచ్‌కు కేంద్రం ప్లాన్!
Azadi Amruth Mahostav Cricket match: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. ఆగస్టు 22న క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలని కేంద్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీసీసీఐతో చర్చలు జరిపింది. అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు ఒక జట్టుగా విదేశాలకు చెందిన ప్రముఖ ఆటగాళ్లు మరో జట్టుగా మ్యాచ్ నిర్వహించాలని భావిస్తోంది.
ఈ మ్యాచ్ కోసం అంతర్జాతీయ ఆటగాళ్లు రావాల్సి ఉందని వెల్లడించాయి. దీనికి చాలా కార్యచరణ ఉంటుందని.. కేంద్రం ప్రతిపాదనపై ఇంకా చర్చ జరుగుతోందని వెల్లడించాయి. కేంద్రం కోరుతున్నసమయంలో ఇంగ్లీష్ దేశవాళీ క్రికెట్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ జరగనుందని గుర్తు చేసింది. భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువగా ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ మ్యాచ్ నిర్వహణ సాధ్యమైతే దిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే అవకాశం ఉందని చెప్పాయి.
ఇదీ చూడండి: అఫ్రిది.. ఏంటీ మార్పు.. నువ్వేనా ఇలా చేసింది?