తెలంగాణ

telangana

ETV Bharat / sports

వేలు విరిగినా లెక్కచేయని ఆసీస్​ స్టార్​ ఆల్​రౌండర్​.. త్వరలో సర్జరీ.. IPLకు డౌటే! - సౌతాఫ్రికా వర్సెస్​ ఆస్ట్రేలియా

ఆసీస్​ ఆల్​రౌండర్​ కామెరూన్​ గ్రీన్​ తీవ్రంగా గాయపడ్డాడు. అయినా లెక్కచేయకుండా మ్యాచ్​ ఆడాడు. అనంతరం ఆస్పత్రికి వెళ్లగా చేతి వేలు విరిగిందని తెలిసింది.

cameron green broken finger
cameron green broken finger

By

Published : Dec 30, 2022, 4:08 PM IST

ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ కామెరూన్​ గ్రీన్​ చేసిన పనికి క్రికెట్​ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అతడి తెగువకు నీరాజనాలు పడుతున్నారు. ఇక సోషల్​ మీడియాలో అయితే గ్రీన్​ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​ వేదికగా బాక్సింగ్ డే రెండో టెస్ట్​ మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో ఫీల్డింగ్​ చేస్తుండగా ఆసీస్​ ఆల్​రౌండర్​ కామెరూన్​ గ్రీన్​కు గాయమైంది. దీంతో అతడు పెవిలియన్​కు వెళ్లిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ గాయాన్ని లెక్కచేయకుండా గ్రీన్​ బ్యాటింగ్​ చేశాడు. అర్ధశతక ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో గ్రీన్‌.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి, సఫారీలను 189 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

కామెరూన్​ గ్రీన్

సఫారీల రెండో ఇన్నింగ్స్​లోనూ అధిక్యం ప్రదర్శంచి 204 పరుగులకే కట్టడి చేసి విజయం సాధించింది ఆసీస్​. మ్యాచ్​ ముగిసిన తర్వాత గ్రీన్​ ఆస్పత్రికి వెళ్లాడు. ఎక్స్​రే అనంతరం ఆతడి గాయం తీవ్రత ఎంతో తెలిసింది. అతడి చేతి వేలి ఎముక విరిగింది. దీంతో అతడికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. త్వరలో ఆ సర్జరీ జరిగే అవకాశముంది. కాగా, సిడ్నీలో జరగబోయే మూడో టెస్టులో గ్రీన్​ను పక్కకు పెట్టారు.

కామెరూన్​ గ్రీన్ ఎక్స్​రే

గ్రీన్​.. ఐపీఎల్​ సంగతేంటో..
ఇటీవలే జరిగిన ఐపీఎల్​ 2023 మినీ వేలంలో రూ. 17.50 కోట్లకు గ్రీన్​ను ముంబయి ఇండియన్స్​ జట్టు కొనుగోలు చేసింది. దీంతో కామెరూన్​ గ్రీన్ ఐపీఎల్​ సమయానికి కోలుకుంటాడో లేదో అని ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు. అయితే 2023లో జరగనున్న బోర్టర్-గవాస్కర్​ ట్రోఫీకి గ్రీన్​ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details