తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind vs Eng: ఒత్తిడిలో ఇంగ్లాండ్- చివరి టెస్టు కోసం జట్టులోకి ఆ ఇద్దరు.. - జాక్​ లీచ్

టీమ్​ఇండియాతో టెస్టు సిరీస్​లో వెనుకపడిన ఇంగ్లాండ్ (ind vs eng)​ చివరి టెస్టు కోసం 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. జోస్ బట్లర్, జాక్​ లీచ్​లను స్వ్కాడ్​లోకి తీసుకుంది.

జో రూట్
ind vs eng

By

Published : Sep 7, 2021, 10:38 PM IST

టీమ్​ఇండియాతో చివరిదైన ఐదో టెస్టు కోసం ఇంగ్లాండ్ (ind vs eng)​ జట్టులోకి తిరిగొచ్చారు వికెట్ కీపర్ జోస్ బట్లర్, స్పిన్నర్​ జాక్ లీచ్. ఓవల్​లో అద్భుత విజయంతో 5 మ్యాచ్​ల సిరీస్​లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది టీమ్​ఇండియా. దీంతో సిరీస్​ను ఎలాగైనా కాపాడుకోవాలనే పక్కా ప్రణాళికలతో 16 మందితో కూడిన స్వ్కాడ్​ను ప్రకటించింది ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు.

తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడం వల్ల నాలుగో టెస్టుకు దూరమయ్యాడు బట్లర్.

ఇవీ మార్పులు..

చివరి టెస్టుకు బ్యాట్స్​మన్ శామ్​ బిల్లింగ్స్​కు విశ్రాంతినిచ్చారు. అండర్సన్​ బదులు తుది జట్టులోకి పేసర్ మార్క్​వుడ్ వచ్చే అవకాశం ఉంది.

ఒత్తిడిలో ఇంగ్లాండ్!

2007 నుంచి టీమ్​ఇండియాపై స్వదేశంలో ఒక్క టెస్టు సిరీస్​ కూడా ఓడిపోలేదు ఇంగ్లాండ్. దీంతో ఎలాగైనా పట్టునిలుపుకోవాలనే ఒత్తిడిలో ఉంది. సెప్టెంబర్​ 10న మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్​లో ఈ ఐదో టెస్టు ప్రారంభంకానుంది.

ఇంగ్లాండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), మెయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, శామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలన్, క్రెయిగ్ ఓవర్టన్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్‌వుడ్.

ఇదీ చూడండి:eng vs ind: 'కోహ్లీసేనకు ఆ విషయం బాగా తెలుసు'

ABOUT THE AUTHOR

...view details