తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS AUS: ముడో టెస్టుకు పిచ్​ ఇదే.. ఈ సారి ఎన్ని రోజులు ఆడతారో? - india vs australia 3rd test pitch

తొలి రెండు టెస్టుల్లో భారత్​ విజయం సాధించడంతో.. పిచ్​లపై ఆసీస్​ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మూడో మ్యాచ్​కు ముందుకు మరోసారి ఆసీస్​ ప్లేయర్​ స్టీవ్ స్మిత్​.. పిచ్​ను పరిశీలించినట్లు ఫొటోలు వైరలవుతున్నాయి. అయితే ఇంతకీ ఈ పిచ్ రివ్యూ ఎలా ఉందంటే?

border gavaskar trophy 2023 india vs australia 3rd test indore stadium pitch review
IND VS AUS: ముడో టెస్టుకు పిచ్​ ఇదే.. ఈ సారి ఎన్నో రోజులు ఆడతారో?

By

Published : Feb 28, 2023, 4:10 PM IST

బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న టెస్ట్​ సిరీస్​లో ఆస్ట్రేలియాపై టీమ్​ఇండియా వరుసగా రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచుల ఈ టెస్ట్​ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. నాగ్‌పుర్‌ వేదికగా జరిగిన టెస్టులో కనీసం పోరాడటానికి ప్రయత్నించిన ఆసీస్‌.. దిల్లీ మాదానంలో మాత్రం చేతులెత్తేసింది. ఇప్పుడు ఇండోర్​ హోల్కర్​ స్టేడియం వేదికగా మూడో మ్యాచ్​కు సిద్ధమైంది. మార్చి 1 నుంచి ప్రారంభంకానుంది. ఇందులోనూ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.
అయితే తొలి రెండు టెస్టులు దాదాపుగా మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. క్యూరేటర్లు పూర్తిగా స్పిన్‌ పిచ్‌లను తయారు చేస్తూ బౌలర్లు, బ్యాటర్లకు ముప్పతిప్పలు పెడుతున్నారు. అయితే పిచ్‌ల నాణ్యతపై ఆస్ట్రేలియా బహిరంగంగానే విమర్శలు చేసింది. ఈ పిచ్​లు భారత స్పిన్నర్లకు అనుకూలంగానే తయారు చేశారంటూ ఆరోపణలు చేసింది. అయితే సాధారణంగానే ఉపఖండపు పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి అన్న విషయం తెలిసిందే. ఇక టీమిండియా స్పిన్నర్లైతే అశ్విన్‌, జడేజాలు అదరగొడుతున్నారు. ఆసీస్​ను దెబ్బతీస్తున్నారు. అయితే మన స్పిన్నర్లే కాదు ఆసీస్​ స్పిన్నర్లు టాడ్​ మర్ఫీ, నాథన్​ లియోన్​లు కూడా వికెట్లు పడగొట్టారు.

ఈ సారి కూడా స్పిన్నర్లకే.. అయితే ఈ ఇండోర్​ పిచ్​ కూడా స్పిన్నర్లకుక అనుకూలంగానే తయారు చేసినట్లు పిచ్​ క్యూరేటర్ తెలిపారు. "పిచ్‌పై కాస్త గడ్డి ఉండడం వల్ల బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. తొలి రెండు టెస్టుల్లో భారీ స్కోరు నమోదు కాలేదు. కానీ మూడో మ్యాచులో కాస్త ఎక్కువగానే రన్స్​ వచ్చే ఛాన్స్​ ఉంటుంది. అయితే గడ్డి పెరిగితే మాత్రం స్పిన్నర్లకు బాగా అనుకూలం అవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ ఐదు రోజులు కొనసాగితే.. చివరి రెండు రోజులు స్పిన్నర్లకు బాగా అనుకూలంగా ఉంటుంది" అని పేర్కొన్నాడు.

పిచ్​ను తయారు చేస్తున్న క్యూరేటర్లు

పిచ్‌ను పరిశీలిస్తున్న స్టీవ్‌ స్మిత్‌.. ఇకపోతే వ్యక్తిగత కారణాల వల్ల ఆసీస్​ కెప్టెన్ పాట్ కమిన్స్​ స్వదేశానికి వెళ్లడంతో మూడో మ్యాచ్​కు స్టీవ్​ స్మిత్​ తాత్కాలిక కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. అయితే ఇప్పటికే తొలి టెస్టు పిచ్​ను ఆసీస్ ప్లేయర్స్​ డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ పరిశీలించగా.. ప్రస్తుతం స్మిత్​ ఒక్కడే ఇండోర్‌ పిచ్‌ను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఫొటోస్​ మళ్లీ వైరల్ అవుతున్నాయి.

పిచ్​ను పరిశీలిస్తున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్​

చివరిసారిగా అప్పుడే.. హోల్కర్‌ స్టేడియంలో 2019 డిసెంబర్‌లో చివరిసారి బంగ్లాదేశ్‌, టీమ్​ఇండియా మధ్య టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్​.. ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇదే వేదికలో రీసెంట్​గా న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌ జరగగా.. రోహిత్‌, గిల్‌లు సెంచరీలతో అదరగొట్టారు. ఈ మ్యాచ్​లో టీమ్​ ఇండియా​ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక తుది జట్టు విషయానికి వస్తే.. కేఎల్‌ రాహుల్‌ జట్టులో కొనసాగుతాడా లేదా అనేది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న రాహుల్‌ను పక్కనబెట్టాలని డిమాండ్స్‌ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేఎల్‌ స్థానంలో శుబ్‌మన్‌ గిల్​ను తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details