న్యూజిలాండ్‌తో నవంబరు 25 (గురువారం) నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో భారత క్రికెటర్ల మెనూపై(BCCI halal meat) వివాదం నెలకొంది. ఈ వివాదంపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్(Arun Dhumal BCCI) స్పష్టతనిచ్చాడు. ఆటగాళ్ల ఆహారపు అలవాట్లపై బీసీసీఐ జోక్యం చేసుకోదని ప్రకటించారు.
"ఆటగాళ్ల డైట్ ప్లాన్‌కు సంబంధించి మేమెలాంటి నిబంధనలు విధించలేదు. ఆటగాళ్లు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవచ్చు. అది శాకాహారమా.?, మాంసాహారమా.? అనేది వారిష్టం"
--అరుణ్ ధూమల్, బీసీసీఐ కోశాధికారి.
కాన్పూర్ వేదికగా జరుగనున్న తొలి టెస్టులో భారత క్రికెటర్ల ఆహారంలో పంది, గోవు మాంసాలను నిషేధించడమే కాక.. హలాల్(BCCI Halal Meat Controversy) చేసిన మాంసాన్నే ఆటగాళ్లకు అందించబోతున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఆటగాళ్లు తినే ఆహారంపై ఆంక్షలు విధించడమేంటని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుతో పాటు న్యూజిలాండ్ జట్టులో కూడా ముస్లిం ఆటగాళ్లు ఉండటంతో హలాల్ చేసిన మాంసాన్ని అందించాలని బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
భారత ఆటగాళ్లకు హలాల్ మాంసం.. చిక్కుల్లో బీసీసీఐ!