తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆటగాళ్ల విశ్రాంతి.. ఇక బీసీసీఐ చేతుల్లో!

ఇకపై ఆటగాళ్లపై ఒత్తిడిని గమనించి బీసీసీఐ(bcci news) వారికి విశ్రాంతిని ఇవ్వనుందని తెలుస్తోంది. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. వరుసగా మ్యాచ్‌లు ఆడి అలసిపోవడం టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021)లో టీమ్‌ఇండియా వైఫల్యానికి ఓ ముఖ్య కారణమన్న విమర్శలు బలంగా వినిపించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందట.

BCCI
బీసీసీఐ

By

Published : Nov 11, 2021, 7:32 AM IST

ఆటగాళ్లు నెలల తరబడి బయో బబుల్‌లో ఉండటం, వరుసగా మ్యాచ్‌లు ఆడి అలసిపోవడం టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021)లో టీమ్‌ఇండియా వైఫల్యానికి ఓ ముఖ్య కారణమన్న విమర్శలు బలంగా వినిపించిన నేపథ్యంలో బీసీసీఐ(bcci news) అప్రమత్తమైంది. ఇకపై ఆటగాళ్లపై పని ఒత్తిడిని అంచనా వేసి, ఎవరికి ఎప్పుడు విశ్రాంతి అవసరమో బోర్డే నిర్ణయించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఒక కమిటీని కూడా నియమించబోతోందట బీసీసీఐ(bcci news). అందులో కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(rahul dravid head coach) కూడా సభ్యుడిగా ఉంటాడట. ఏ ఆటగాడు ఎన్ని మ్యాచ్‌లు ఆడుతున్నాడు.. ఎంత కాలం బయో బబుల్లో గడుపుతున్నాడు అన్న విషయాలను సమీక్షించి.. నిర్ణీత వ్యవధి తర్వాత ప్రతి ఆటగాడికీ విశ్రాంతి ఇచ్చేలా విధానం రూపొందిస్తున్నట్లు తెలిసింది.

ఇప్పటిదాకా విశ్రాంతి తీసుకోవడం ఆటగాళ్లు చేతుల్లోనే ఉండేది. కొన్నిసార్లు విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్న క్రికెటర్లను గుర్తించి సెలక్టర్లే వారికి విశ్రాంతి కల్పించేవారు. అయితే అలసట, బయో బబుల్‌ ఒత్తిడి గురించి ఆటగాళ్ల నుంచి ఫిర్యాదులు వస్తుండటం.. టీ20 ప్రపంచకప్‌ వైఫల్యం నేపథ్యంలో విమర్శలు పెరగడం వల్ల బీసీసీఐ(bcci news) కొత్త విధానానికి సిద్ధమైంది. దీని ప్రకారం ఏ ఆటగాడికి ఎప్పుడు విశ్రాంతి ఇవ్వాలన్నది బీసీసీఐయే(bcci news) నిర్ణయించబోతోంది.

ఇవీ చూడండి: T20 WC semifinal: పాక్‌ను ఆపతరమా?.. ఆసీస్​కు కఠిన సవాల్!

ABOUT THE AUTHOR

...view details