టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం చెందిన టీమ్ఇండియా.. టీ20 జట్టు ఇకపై నూతన నాయకత్వంలో అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే టీ20 జట్టు కెప్టెన్‌గా (Team India New Captain) రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించింది బీసీసీఐ. దీంతో టెస్టు సారథ్యంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా తప్పుకొంటే ఎవరికి పగ్గాలు అప్పజెప్పాలనే (Team India New Captain) విషయంపై బీసీసీఐకి ఓ స్పష్టత లేదని తెలుస్తోంది. టీ20 కెప్టెన్‌గా రోహిత్‌కు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో టెస్టు సారథ్యమూ అతడికే ఇవ్వాలని కొందరు అంటుండగా.. మరికొందరు రహానే పేరును వినిపిస్తున్నారు.
త్వరలోనే న్యూజిలాండ్ టీ20 సిరీస్ తర్వాత రెండు టెస్టుల్లో తలపడనుంది టీమ్ఇండియా. ఈ పర్యటనలోని టీ20 సిరీస్‌కు కోహ్లీకి (Team India New Captain) విశ్రాంతినిచ్చారు. అయితే. మొదటి టెస్టుకూ అతడు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. దీంతో ఈ టెస్టుకు ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. ఇందులో రహానె, రోహిత్ ముందు వరుసలో ఉన్నారు.
రహానెకు అదే సమస్య