Ganguly on Umran Malik: భారత టీ20 లీగ్‌లో హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న పేస్ బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఉమ్రాన్ మాలిక్ ఫిట్‌గా ఉంటే సుదీర్ఘకాలంపాటు టీమ్‌ఇండియాకు ఆడతాడని పేర్కొన్నాడు. 'ఉమ్రాన్ మాలిక్ భవిష్యత్ అతడి చేతుల్లోనే ఉంది. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉండి ఇదే వేగంతో బౌలింగ్ చేస్తే కచ్చితంగా సుదీర్ఘకాలంపాటు టీమ్‌ఇండియాకు ఆడతాడనే నమ్మకం నాకుంది' అని గంగూలీ వివరించాడు. మరికొన్ని రోజుల్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఆదివారం జట్టుని ప్రకటించింది. దీంట్లో ఉమ్రాన్ మాలిక్ చోటు దక్కించుకున్నాడు.
ఉమ్రాన్ భవిష్యత్ అతడి చేతుల్లోనే ఉంది: గంగూలీ
Umran Malik: ఉమ్రాన్ మాలిక్ భవిష్యత్ అతడి చేతుల్లోనే ఉందన్నాడు సౌరభ్ గంగూలీ. ఇదే వేగంతో బౌలింగ్ చేస్తే కచ్చితంగా సుదీర్ఘ కాలంపాటు టీమ్‌ఇండియాకు ఆడతాడనే నమ్మకం తనకుందని చెప్పాడు.
భారత టీ20 లీగ్‌లో అదరగొడుతున్న మరికొంతమంది ఎమర్జింగ్ ప్లేయర్స్‌ని కూడా గంగూలీ ప్రశంసించాడు. ‘ఈ సీజన్‌లో చాలా మంది ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. తిలక్ వర్మ (ముంబయి), రాహుల్ త్రిపాఠి (హైదరాబాద్), రాహుల్ తెవాతియా (గుజరాత్) రాణిస్తున్నారు. ఉమ్రాన్ మాలిక్, మెహ్‌సిన్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్ వంటి ఎందరో ఎమర్జింగ్ ఫాస్ట్‌బౌలర్లను మనం చూశాం. భారత టీ20 లీగ్ అనేది ప్రతిభను బహిర్గతం చేసే వేదిక’ అని గంగూలీ అన్నాడు. జూన్ 9 నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు సీనియర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా, రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
ఇదీ చదవండి:రాహుల్ పోరాడినా.. ప్లేఆఫ్స్ నుంచి లఖ్‌నవూ ఔట్.. ఆర్సీబీ ముందంజ