BCCI on Ranji Trophy: దేశంలో కొవిడ్ పరిస్థితుల కారణంగా ఇటీవలే దేశవాళీ టోర్నీలు వాయిదా వేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). తాజాగా ఈ టోర్నీలను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ రంజీ ట్రోఫీ నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు. రెండు దశల్లో టోర్నీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
"రంజీ ట్రోఫీ వాయిదా వేసిన సమయంలో దేశంలో కొవిడ్ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్‌కు ముందు, తర్వాత రంజీ ట్రోఫీని నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది."
--అరుణ్ ధుమాల్, బీసీసీఐ కోశాధికారి.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాతో సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు అరుణ్ ధుమాల్. ఫిబ్రవరిలో తొలి దశ రంజీ ట్రోఫీ నిర్వహించి.. జూన్-జులైలో రెండో దశ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.