బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై మహిళా క్రికెటర్లకూ.. - bcci pay equity policy
12:39 October 27
బీసీసీఐ సంచలన నిర్ణయం
క్రికెట్ చరిత్రలో బీసీసీఐ సరికొత్త నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ వ్యవస్థలో ఎలాంటి వివక్షకు తావులేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. పే ఈక్విటీ పాలిసీ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇక పై భారత మహిళా క్రికెట్‌ర్లకు కూడా పురుషుల క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజ్‌ను ఇవ్వనుంది. క్రికెట్‌లో లింగ సమానత్వం తీసుకొచ్చే దిశగా ఈ కొత్త నిర్ణయం తీసుకన్నట్లు వెల్లడించింది.టెస్టు మ్యాచ్‌కు 15లక్షలు, వన్డేకు 6లక్షలు, టీ-20కు 3లక్షల చొప్పున చెల్లించనున్నట్లు తెలిపింది. మహిళా కికెటర్ల పట్ల తమకున్న నిబద్ధతకు ఇది నిదర్శమని పేర్కొంది.
"లింగ వివక్షను అధిగమించే దిశగా బీసీసీఐ తొలి అడుగు వేసినందుకు నేను సంతోషిస్తున్నాను. కాంట్రాక్టు ఉన్న మహిళా క్రికెటర్ల కోసం మేము పే ఈక్విటీ విధానాన్ని అమలు చేస్తున్నాము. భారత క్రికెట్‌లో.. లింగ సమానత్వంలో కొత్త శకానికి నాంది పలికాము. ఇకపై పురుష, మహిళా క్రికెటర్లకు.. మ్యాచ్ ఫీజు ఒకే విధంగా ఉంటుంది. ఈ నిర్ణయం విషయంలో సపోర్ట్ చేసిన అపెక్స్ కౌన్సిల్‌కు ధన్యవాదాలు." అని బోర్టు సెక్రటీరీ జైషా ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:T20 worldcup: రోసో అద్భుత సెంచరీ.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా భారీ విజయం