తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ - ఇండియా ఆస్ట్రేలియా వన్డే సిరీస్​ 2023 భారత జట్టు

ప్రస్తుతం జరుగుతున్నబోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్​ అనంతరం.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది టీమ్​ఇండియా. తాజాగా ఈ వన్డే సిరీస్​ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. కెప్టెన్​గా​ రోహిత్​ శర్మ, వైస్​ కెప్టెన్​గా హార్దిక్​ పాండ్య వ్యవహరించనున్నారు. పూర్తి జట్టు ఇదే..

team india squad
team india squad

By

Published : Feb 19, 2023, 6:20 PM IST

Updated : Feb 19, 2023, 6:42 PM IST

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్​కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వల్ల మొదటి వన్డేకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని తెలిపింది. తొలి వన్డే మ్యాచ్​కు హార్దిక్​ పాండ్య సారథ్యం వహిస్తాడని పేర్కొంది. కాగా, మొదటి వన్డే మార్చి 17న ముంబయిలో జరగనుంది. రెండో మ్యాచ్ 19 మార్చి​ విశాఖపట్నంలో, మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరగనున్నాయి. ఇక, బోర్డర్-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా జరగనున్న ముడు, నాలుగు టెస్టులకు కూడా జట్టును బీసీీసీఐ ప్రకటించింది.
భారత వన్డే జట్టు vs ఆస్ట్రేలియా : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్​మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్​ అయ్యర్​, సూర్య కుమార్​ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషన్​ కిషన్(కీపర్), హార్దిక్​ పాండ్య(వీసీ), జడేజా, కూల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, మహ్మద్​ షమీ, మహ్మద్ సిరాజ్​, ఉమ్రాన్​ మాలిక్, శార్దుల్​ ఠాకూర్​, అక్షర్​ పటేల్, జయదేవ్​ ఉనద్కత్.

భారత టెస్టు జట్టు vs ఆస్ట్రేలియా : రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్​ రాహుల్, శుభ్​మన్ గిల్, ఛెతేశ్వర్​ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్​ భరత్(కీపర్​), ఇషన్​ కిషన్(కీపర్), అశ్విన్, అక్షర్​ పటేల్, కుల్దీప్​ యాదవ్, జడేజా, షమీ, సిరాజ్​, సూర్య కుమార్​ యాదవ్, ఉమేష్​ యాదవ్, ఉనద్కత్​

Last Updated : Feb 19, 2023, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details